NTV Telugu Site icon

Ginger Garlic Prank: ఎంతకు తెగించార్రా.. ఎవరికైనా ఏమైనా అయితే బాధ్యులెవరు.?

Prank Video

Prank Video

Ginger Garlic Prank: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో జీవిస్తున్నాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా భారతదేశంలో చాలామంది సగం రోజును కేవలం సోషల్ మీడియాకు కేటాయిస్తున్నాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో చాలామంది యువత సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ కావడానికి అనేక డేంజర్ స్టంట్స్ చేస్తూ ఫేమస్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ డేంజర్ పనులు చేస్తున్న సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా చాలానే చూశాము. మరోవైపు సోషల్ మీడియాలో అనేక రకాల ఫన్నీ వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొందరు ప్రాంక్ వీడియోలు అంటూ చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రాంక్ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

UP Video: యూపీలో రెచ్చిపోయిన జంట.. కారులో వెళ్తూ చిల్లర చేష్టలు

వైరల్ గా మారిన వీడియోలో.. ఓ వ్యక్తి అత్తర్ అంటూ ఓ చిన్న అత్తర్ సీసాను తీసుకొని ప్రాంక్ చేశాడు. అయితే అత్తర్ సీసాలో సుగంధాలు రావాల్సిన వాసన సంబంధించిన ఆయిల్ కాకుండా.. అల్లం, వెల్లుల్లి రసంతో నింపాడు. ఆ తర్వాత దానిని తన స్నేహితులతో వాసన చూపించి వారు ఆ వాసనకు ఎలా రియాక్ట్ అయ్యారో సంబంధించిన క్లిప్స్ ఈ వీడియోలో మనం గమనించవచ్చు. చేతికి అత్తరుగా చెప్పి పూసిన దానిని వ్యక్తి స్నేహితులు వాసన చూసి ఒక్కొక్కరు అసహ్యించుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందించారు. ఒకవేళ ఆ వాసన చూసి ఏదైనా లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో., ప్రాంక్ మామూలుగా చేయలేదు అంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ఓసారి వీక్షించి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.

Show comments