Site icon NTV Telugu

Python: జింకను మింగి.. రోడ్డుపై అడ్డంగా పడుకున్న భారీ కొండచిలువ

జింకను మింగి రోడ్డుపై అడ్డంగా పడుకున్న భారీ కొండచిలువ

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ జింకను పూర్తిగా మింగిన తర్వాత కదలలేక రోడ్డుపై అడ్డంగా పడి కనిపించింది. జింకను మింగిన కారణంగా దాని పొట్టభాగం భారీగా ఉబ్బిపోయి, ముందుకు పాకడం కూడా కష్టంగా మారింది. ఈ దృశ్యం చూసిన వాహనదారులు షాక్‌కు గురయ్యారు.

అటుగా వెళుతున్న పలువురు ఈ కొండచిలువను చూసి ఆశ్చర్యపోయి, మొబైల్ ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది వెంటనే అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే వారు అక్కడికి చేరుకునేలోపు కొండచిలువ క్రమంగా అడవివైపు చప్పున వెళ్లిపోయింది. రోడ్డుమీద అడ్డంగా పడి, కదలడానికి ప్రయత్నిస్తున్న ఆ భారీ కొండచిలువ దృశ్యాలు నెటిజన్లను విస్తుపోయేలా ఉన్నాయి.

Exit mobile version