Site icon NTV Telugu

Ghost : మూవీ ప్రమోషన్స్ లో పునీత్ ను తలుచుకొని ఎమోషనల్ అయిన శివన్న..

Whatsapp Image 2023 10 18 At 3.41.37 Pm

Whatsapp Image 2023 10 18 At 3.41.37 Pm

కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన కన్నడలో తిరుగులేని స్టార్‌ డమ్ సంపాదించాడు.ఇటీవలే ఆయన జైలర్ సినిమాలో కామియో రోల్ తోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక శివన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్‌’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫప్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్‌ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.విజయదశమి కానుక గా.. అక్టోబర్ 19 న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేరళకు వెళ్లిన శివరాజ్ కుమార్ ఓ ఈవెంట్‌లో తన తమ్ముడు దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.. పుణీత్ రాజ్ కుమార్ మరణ వార్త ప్రపంచ వ్యాప్తం గా ఆయన అభిమానుల కు తీరని శోకాన్ని మిగిల్చింది.’

“ఘోస్ట్‌” మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్‌కుమార్ మరణం నేను ఎప్పటికీ ఒప్పుకోలేని నిజం. పునీత్ నాకంటే 12-13 ఏళ్లు చిన్నవాడు. నేను నా భావాలను వ్యక్తపరచలేను. నేనెప్పుడూ పునీత్ సమాధి వద్దకు వెళ్లను. ఎందుకంటే అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించను . తాను అలాంటి పద్ధతులను నమ్మే వ్యక్తిని కాదని, పునీత్ చనిపోయాడని తాను అంగీకరించగలిగితేనే ఇలాంటివి ఆలోచించడం, చేయడంలో అర్థం ఉంటుందని శివరాజ్ కుమార్ అన్నారు.అలాగే తన సినిమా గురించి తెలియజేసారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సందేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సందేశ్‌ నాగరాజ్‌ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్ మరియు దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా లో శివరాజ్ కుమార్ మూడు విభిన్న గెటప్స్‌ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించనున్నాడు.

Exit mobile version