NTV Telugu Site icon

GHMC: ఆస్తులు, భవనాల సమగ్ర సర్వే చేయాలని జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం..

Ghmc

Ghmc

ఆస్తులు, భవనాల సమగ్ర సర్వే చేయాలని జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి, నీరు, ఇతర పన్నులను సంబంధించి సమర్థవంతంగా రికవరీ చేయడానికి.. డిఫాల్టర్లను మెరుగ్గా ట్రాకింగ్ చేయడానికి GIS ఆధారిత సర్వేకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా.., ప్రతీ ప్లాట్, భవనం యొక్క సరిహద్దులను తెలుసుకోవడానికి సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ తో ఉపగ్రహ డేటా, డ్రోన్‌ లను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఈ సంఫర్బంగా ఆస్తులను తక్కువ అంచనా వేయడం, పన్నులు ఎగవేస్తున్న వారిపై నిఘా ఉంచేందుకు జిఐఎస్ సర్వే సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

EVM: ‘‘ వాటికి ఇప్పుడు విశ్రాంతినివ్వండి.. వచ్చే ఎన్నికల్లో తిట్టండి’’..ఈవీఎంలను నిందించడంపై సీఈసీ సెటైర్లు..

ఈ పనిని నియో జియో ఏజెన్సీకి రెండేళ్ళ పాటు భాద్యతలు జిహెచ్ఎంసీ అప్పగించింది. ఈ సర్వేలో ఏడాదిన్నరలో ఏకంగా 20 లక్షల భవనాలను సర్వే చేసేలా ఏజెన్సీ కి టార్గెట్​పెట్టనున్నట్లు సమాచారం. సర్వే వివరాలను ఏరోజుకు ఆరోజు సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ​కు అందించేలా ప్లాన్​ చేయనున్నారు. ఈ విషయంలో రిపోర్టు అందగానే సర్కిల్ స్థాయి అధికారులు భవనం విస్తీర్ణం ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఏమైనా మార్పు ఉందా అన్న వివరాలను పరిశీలించి., విస్తీర్ణంలో మార్పు ఉంటే వెంటనే వారి అసెస్మెంట్ లో విస్తీర్ణాన్ని మార్చి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం రెండున్నరేండ్ల ప్రపార్టీ ట్యాక్స్ ను వెంటనే వసూలు చేయనున్నారు. ఇలాంటి సర్వే ఇప్పటికే మహారాష్ట్ర లోని బృహన్ ​ముంబై కార్పొరేషన్ ​అమలు పరుస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులు కొందరు అక్కడి పనితీరును ఇదివరకే పరిశీలించారు.

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు