మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు మరో షాక్ తగిలింది. ఈసారి అల్లు అరవింద్ కు GHMC షాకిచ్చింది. వివరాలలోకెళితే.. నిర్మాత అల్లు అరవింద్ కు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట భారీ భవనం ఉంది. 2023 లో అల్లు అరవింద్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసారు. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ కు కూత వేటు దూరంలో ఉంటుంది ఈ అల్లు బిజినెస్ పార్క్. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా అప్పట్లో ఆ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
Also Read : NaniOdela2 : నాని ‘ప్యారడైజ్’ కోసం 30 ఎకరాలలో భారీ ప్లానింగ్
ఈ అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి GHMC అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేశారు అల్లు అరవింద్. కానీ ఇటీవల GHMC అనుమతులు లేకుండా ఈ బిజినెస్ పార్క్ లో పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు తాము ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేసారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని అధికారులు తెలిపారు. మరి అల్లు పార్క్ లోని పెంట్ హౌస్ కట్టడంపై అల్లు అరవింద్ ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి.
