Site icon NTV Telugu

Road Accident: టస్కర్ కిందపడి జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు మృతి!

Road Accident

Road Accident

Road Accident: ఆదివారం (సెప్టెంబర్ 7) ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుడిమల్కాపూర్ కు చెందిన రేణుక అనే జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు తన విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతికి కారణమైంది. గత 15 ఏళ్లుగా జిహెచ్ఎంసిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న రేణుక, బషీర్ బాగ్ నుండి లిబర్టీ దిశగా మార్గంలో పని నిర్వహించుకుంటోంది. ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించగా, అదే సమయంలో బషీర్ బాగ్ నుండి వస్తున్న టస్కర్ వాహనం కింద ఆమె ప్రమాదవశాత్తు పడిపోయింది.

Read Also: Crime News: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. తల్లిపై విచక్షణ రహితంగా?

అలా కింద పడిన ఆమెపై వాహనం ఎక్కి పోయింది. దీనితో తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న ఇతర పారిశుద్ధ్య కార్మికులు రేణుకను పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, వైద్యులు ఆమె
అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. టస్కర్ డ్రైవర్ గజానంద్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా, రేణుక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Bomb Blast: మ్యాచ్ జరుగుతుండగా బాంబు బ్లాస్ట్.. ఒకరు మృతి!

Exit mobile version