NTV Telugu Site icon

Taj Banjara Hotel: బంజారాహిల్స్‌ లోని తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్..

Taj Banjara Hotel

Taj Banjara Hotel

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 1లోని స్టార్‌ హోటల్‌ అయిన తాజ్‌ బంజారా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. ఈ హోటల్‌ నిర్వాహకులు గడిచిన రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేయడంతో పాటు పలు మార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని ఆఖరికి రెడ్‌ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. రెండు సంవత్సరాలుగా సదరు సంస్థ ’ రూ. 1 కోటి 40 లక్షల పన్ను బకాయి ఉన్నారని ఎంతకు స్పందించకపోవడంతో హోటల్‌ను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

READ MORE: Sangareddy: చాక్లెట్ ఆశ చూపి.. 8 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు యువకుల అత్యాచారం..

READ MORE: CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్..