Harassing: బల్దియా ఉద్యోగినిపై వేధింపులు.. మహిళలు లేని చోటుకు ట్రాన్స్ ఫర్ చేయాలని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassing: సంవత్సరాలు గడుస్తున్నా మహిళలపై జరుగుతున్న దాడులు విషయంలో మాత్రం మార్పు రావడంలో లేదు. పైగా ఏడాదికేడాది ఆ సంఖ్య పెరుగుతుంది. మహిళలపై నేరాలకు సంబంధించిన కంప్లైట్లలో ఎక్కువగా మానసిక వేధింపులే. సమాజంలో నానాటికీ మహిళలపై వేధింపులు, అరాచకాలు పెరిగిపోతున్నాయి. అవాంఛనీయ, హింసాత్మక ఘటనల గురించి రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇల్లు, ఆఫీసు, బడి, గుడి, బజారు ఇలా ప్రతిచోట ఏదో ఒక మూల మహిళ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఇటువంటి ఘటనే హైదరాబాద్ లోని మహిళా ఉద్యోగినిపై ఓ అధికారి వేధింపులకు పాల్పడిన ఘటన జిహెచ్ఎంసిలో చోటుచేసుకుంది.
Read also: Chain Snatching: ఓరేయ్ ఎంట్రా ఇదీ.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ దొంగతనాలు ఎంట్రా బాబు
Also Read
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా కె.లావణ్య విధులు నిర్వహిస్తోంది. ఆమెపై కొంతకాలంగా అందులోనే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్.మోహన్‌సింగ్ తనను మానసికంగా వేధిస్తుండటంతో సహించలేకపోయింది. అతని నుంచి తప్పించుకుంటూ వచ్చింది. అయినా అతను ఆమెను మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు ఇక తట్టుకోలేని లావణ్య ఆర్.మోహన్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బల్దియా కమిషనర్ లోకేష్‌కుమార్.. పబ్లిక్‌హెల్త్ అండ్ మున్సిపల్‌శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు. దీంతో అతడిని జీహెచ్ ఎంసీ నుంచి తప్పించి ప్రాధాన్యత లేని, మహిళలేతర పోస్టుకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. కమిషనర్ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.లావణ్య.. బల్దియాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.మోహన్ సింగ్ తనను వేధిస్తున్నారని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఫిర్యాదు చేసింది. దీనిపై కమిటీ విచారణ జరిపి సంబంధిత ఆరోపణలు నిజమని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కమీషనర్‌కు పంపగా.. లోకేష్ జతచేసి ఆర్.మోహన్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌పై చర్యలు తీసుకున్నారు.
New Scheme : ఆమ్మాయి పుడితే ఐదువేలు.. సర్పంచ్ ను పొగుడుతున్న జనం
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!