NTV Telugu Site icon

Harassing: బల్దియా ఉద్యోగినిపై వేధింపులు.. మహిళలు లేని చోటుకు ట్రాన్స్ ఫర్‌ చేయాలని..

Harasment

Harasment

Harassing: సంవత్సరాలు గడుస్తున్నా మహిళలపై జరుగుతున్న దాడులు విషయంలో మాత్రం మార్పు రావడంలో లేదు. పైగా ఏడాదికేడాది ఆ సంఖ్య పెరుగుతుంది. మహిళలపై నేరాలకు సంబంధించిన కంప్లైట్లలో ఎక్కువగా మానసిక వేధింపులే. సమాజంలో నానాటికీ మహిళలపై వేధింపులు, అరాచకాలు పెరిగిపోతున్నాయి. అవాంఛనీయ, హింసాత్మక ఘటనల గురించి రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇల్లు, ఆఫీసు, బడి, గుడి, బజారు ఇలా ప్రతిచోట ఏదో ఒక మూల మహిళ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఇటువంటి ఘటనే హైదరాబాద్‌ లోని మహిళా ఉద్యోగినిపై ఓ అధికారి వేధింపులకు పాల్పడిన ఘటన జిహెచ్ఎంసిలో చోటుచేసుకుంది.

Read also: Chain Snatching: ఓరేయ్‌ ఎంట్రా ఇదీ.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ దొంగతనాలు ఎంట్రా బాబు

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా కె.లావణ్య విధులు నిర్వహిస్తోంది. ఆమెపై కొంతకాలంగా అందులోనే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆర్‌.మోహన్‌సింగ్‌ తనను మానసికంగా వేధిస్తుండటంతో సహించలేకపోయింది. అతని నుంచి తప్పించుకుంటూ వచ్చింది. అయినా అతను ఆమెను మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు ఇక తట్టుకోలేని లావణ్య ఆర్‌.మోహన్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌.. పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు లేఖ రాశారు. దీంతో అతడిని జీహెచ్ ఎంసీ నుంచి తప్పించి ప్రాధాన్యత లేని, మహిళలేతర పోస్టుకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. కమిషనర్ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.లావణ్య.. బల్దియాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.మోహన్ సింగ్ తనను వేధిస్తున్నారని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఫిర్యాదు చేసింది. దీనిపై కమిటీ విచారణ జరిపి సంబంధిత ఆరోపణలు నిజమని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కమీషనర్‌కు పంపగా.. లోకేష్ జతచేసి ఆర్.మోహన్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌పై చర్యలు తీసుకున్నారు.
New Scheme : ఆమ్మాయి పుడితే ఐదువేలు.. సర్పంచ్ ను పొగుడుతున్న జనం