Site icon NTV Telugu

GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్

Ghmc Ai1

Ghmc Ai1

GHMC: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. నగరంలోని ఆరాంఘర్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఈ డ్రైవ్‌లో అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల చిరు వ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. రోడ్డును ఆక్రమించి డబ్బాలు, షెడ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫుట్‌పాత్‌లను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరవ్యాప్తంగా ఇలాంటి ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

READ MORE: AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!

Exit mobile version