Site icon NTV Telugu

GHMC Council Meeting: “వందేమాతరం” గీతానికి అవమానం.. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట..

Ghmc

Ghmc

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం సభ్యులు కుర్చీలపైకి ఎక్కి ఆందోళన చేశారు. మేయర్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్‌తో బయటకు పంపుతానని అనడంతో గొడవవ సర్దుమణిగింది. కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం ఆలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు.. మేయర్ అంగీకారం తెలిపి.. అందెశ్రీకి నివాళికి చిహ్నంగా జయజయహే తెలంగాణ కూడా పాడుదాం అని కోరారు.. అయితే దీన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది..

READ MORE: CRPF: కర్రెగుట్టలను హస్తగతం చేసుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు.. నెక్ట్స్‌ ప్లాన్ వివరించిన సీఆర్పిఎఫ్ ఐజీ..!

అనంతనం.. సభలో వందేమాతరం గీతాలాపన కొనసాగింది. చెత్త బజార్ డివిజన్ కార్పొరేటర్ సోహెల్ వందేమాతరం గీతాలాపన సమయంలో నిలబడకుండా నిరసన తెలిపారు.. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు కొందరు నిలబడకుండా నిరసన తెలుపుతూ కౌన్సిల్‌లో కూర్చుండిపోయారు.. బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తీవ్ర స్థాయికి చేరుకుంది. కౌన్సిల్‌లో వీళ్ల గలాటా కొనసాగుతుండగా.. మార్షల్ లోపలికి చేరుకున్నారు.. మనమేమైన రౌడీలమా? అంటూ మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వాగ్వాదం మధ్య GHMC కౌన్సిల్ వాయిదా పడింది.

READ MORE: Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లో మాస్ ఫైట్.. రిథు కారణంగా కళ్యాణ్ మెడ పట్టుకున్న డీమాన్ పవన్

Exit mobile version