NTV Telugu Site icon

Viral : తాగిన ఒక్క బీరుకు.. బారెడంత బిల్లు వేసి మత్తు దించిన పోలీసులు

Bike Ride

Bike Ride

Viral : అసలు బహిరంగంగా తాగడమే తప్పు.. పైగా రోడ్డుమీద. రాయల్ ఫీల్డ్ బైక్ ఎక్కి.. నేను రాజును నన్నెవరు ఏం చేస్తారులే.. అని ఫీలయినట్టున్నాడు. మనోడి అతి చేష్టలు చూసి పోలీసులు తగిన శాస్తి చేశారు. అసలేం అయిందంటే.. ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్లో ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు.

Read Also: Fake Call : ర‌ష్యా – గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ లేదు.. ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు భారీమొత్తంలో జరిమానా వేసి తాగిన మత్తు దించారు పోలీసులు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Show comments