NTV Telugu Site icon

Gym Trainer : హార్ట్ ఎటాక్ తో కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలిన జిమ్ ట్రైనర్

Gym Triner

Gym Triner

Gym Trainer : గుండెపోటుతో సడెన్ గా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కొద్ది వారాల కిందట ముంబైలో నవరాత్రి ఉత్సవాల్లో ఓ వ్యక్తి గార్భా నృత్యం చేస్తూ చనిపోయాడు. అలాగే, కశ్మీర్‌లో ఓ కళాకారుడు కూడా నృత్య ప్రదర్శన చేస్తూ వేదికపైసే గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఘజియాబాదులో గుండెపోటుకు గురై ఓ జిమ్ ట్రైనర్ కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలాడు.

Read Also: RTC Driver: ఉన్నట్టుండి బస్సు ఆగింది.. డ్రైవర్ పరార్.. అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌లోని షాలిమార్‌ గార్డెన్ ప్రాంతంలో ఆదిల్ అనే వ్యక్తి సొంతంగా జిమ్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి అప్పటివరకు బాగానే ఉన్న అదిల్‌ తన ఆఫీసులో పనిచేసుకుంటూ ఒక్కసారిగా కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. ఉన్నట్టుండి అతడు కుర్చీలో కూలబడటంతో అక్కడ సహాయకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అదిల్ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని ఘజియాబాద్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ ఫుటేజీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read Also: Gold Price: దీపావళి ఆఫర్.. కుప్పకూలిన బంగారం ధర

ఘజియాబాద్‌లోని షాలిమార్‌ గార్డెన్ ప్రాంతంలో సొంతంగా జిమ్‌ నిర్వహిస్తున్న ఆదిల్‌.. అక్కడే రోజూ వ్యాయామం చేస్తూ శిక్షణ ఇస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నప్పటికీ జిమ్‌కు వెళ్లడం మానలేదని వారు పేర్కొన్నారు. అయితే, ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించిన ఆదిల్‌.. షాలిమార్‌ గార్డెన్‌లో ఆఫీస్ ప్రారంభించాడు. ఆదివారం అక్కడే పనిచేసుకుంటూ ఒక్కసారిగా గుండెపోటుకు గురైన హఠాన్మరణం చెందారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం అలముకొంది.