Site icon NTV Telugu

Ghattamaneni Jayakrishna: జయకృష్ణ డెబ్యూ సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

Ghattamaneni Jayakrishna

Ghattamaneni Jayakrishna

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతుండగా, ఘట్టమనేని కుటుంబం నుంచి మరొకరు హీరో గా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అతను ఎవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు, యంగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ (జై) తన డెబ్యూ సినిమాతోనే భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. జై – అజయ్ భూపతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ సినిమా టీమ్ నుంచి ఒక కీలక అధికారిక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీ.వి. ప్రకాష్ కుమార్‌ను ఫైనల్ చేశారు.

Also Read : Manchu Manoj : రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్ – డ్రగ్స్‌పై కఠిన హెచ్చరిక

జీ.వి. ప్రకాష్ తమిళ్‌ తో పాటు తెలుగులోనూ ధమాకా హిట్స్ ఇచ్చిన టాలెంటెడ్ మ్యూజిక్ సెన్సేషన్. ఇటీవల ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలకు అందించిన ఆల్బమ్స్ మంచి హైప్ తెచ్చుకున్నాయి. ఆయన ఈ డెబ్యూ ప్రాజెక్ట్‌కి జత కావడంతో సినిమాకు ఇంకా మాస్ మరియు మ్యూజికల్ స్ట్రెంగ్త్ వచ్చిందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాషా తాడని నటిస్తుండగా, నిర్మాణం జెమినీ కిరణ్ చేస్తున్నారు. పెద్ద బ్యానర్ అండగా దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జై – అజయ్ భూపతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ లాంచ్ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే మరిన్ని కాస్టింగ్, షూటింగ్ వివరాలు టీమ్ ప్రకటించనుంది.

 

Exit mobile version