Ghattamaneni Family : ఘట్టమనేని మూడో తరంలో స్టార్ అయ్యేదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘సూపర్ స్టార్’ అనే పదానికి నిలువెత్తు రూపం కృష్ణ. ఆయన వారసత్వాన్ని సెకండ్ జనరేషన్‌లో మహేశ్ బాబు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రమేశ్ బాబు 15 సినిమాల్లో నటించినా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. మంజుల కూడా నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ‘ఘట్టమనేని మూడో తరం’ పైనే ఉంది. ఈ తరంలో అందరూ నటీనటులుగానే వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతున్నారు.
రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ ఇప్పటికే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. గతంలో మహేశ్ బాబు సినిమా ‘నిజం’లో చిన్నప్పటి మహేశ్‌గా నటించిన జయకృష్ణ ఇప్పుడు ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఘట్టమనేని ఆడపడుచులు కూడా నటనపై ఆసక్తి చూపిస్తున్నారు. రమేశ్ బాబు కూతురు భారతి ఇప్పటికే సోషల్ మీడియాలో తన డాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి, త్వరలోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంజుల కూతురు జాన్వీ స్వరూప్ ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె బర్త్‌డే సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే జాన్వీ కూడా వెండితెర అరంగేట్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
సితార – గౌతమ్ లపై భారీ అంచనాలు సూపర్ స్టార్ మహేశ్ బాబు పిల్లలు సితార, గౌతమ్ లపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఇప్పటికే ‘సర్కారువారి పాట’ ప్రమోషనల్ సాంగ్‌లో మెరిసి, సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆమె త్వరలోనే వెండితెరపైకి వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక గౌతమ్ కృష్ణ, ‘నేనొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేస్తున్నాడు. త్వరలోనే అతడు పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకోవాలని ఘట్టమనేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!