Getup Srinu’s Raju Yadav Movie Trailer Out: బుల్లితెర హిట్ షో ‘జబర్దస్త్’లో తన టాలెంట్‌తో ఆకట్టుకున్న గెటప్ శ్రీను.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గెటప్ శ్రీను హీరోగా చేసిన సినిమా ‘రాజు యాదవ్’. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా డెబ్యూ డైరెక్టర్ దర్శకుడు కృష్ణమాచారి ఈ చిత్రంను తెరకెక్కించారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కె ప్రశాంత్‌రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజు యాదవ్ నుంచి విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
మే 17న రాజు యాదవ్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేశారు. సూపర్ హీరో తేజ సజ్జ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. రాజు యాదవ్ జీవితంలోని విషాదానికి దారితీసిన సంఘటనతో ట్రైలర్ ప్రారంభమైంది. క్రికెట్ గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. బంతి తగలడంతో రాజు యాదవ్ తన ముఖ కండరాలను కదల్చలేడు. దాంతో అతను ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తాడు. ఇదే అతనికి కష్టాలను తెచ్చిపెడుతుంది. ట్రైలర్‌లో గెటప్ శ్రీను ఫేస్ నవ్వులు పూయిస్తుంది.
Also Read: Virat Kohli: నీ అంత క్రికెట్ ఆడలేదు.. కోహ్లీపై ఫైర్ అయిన టీమిండియా దిగ్గజం!
రాజు యాదవ్ సినిమాలో అంకితా ఖరత్ కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిచగా.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణమాచారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. బుల్లితెర కమల్ హాసన్‌గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను.. వెండి తెరపై ఎలా అలరిస్తాడో చూడాలి.