NTV Telugu Site icon

Raju Yadav :ఉన్న ఒక్క సినిమా కూడా పోయింది.. రాజు యాదవ్ పై గెటప్ శ్రీను పోస్ట్..

Rajuyadav16

Rajuyadav16

జబర్దస్త్ షో ద్వారా చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. అందులో బుల్లి తెర కమల్ హాసన్ గా గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు టీవీ షోలు సినిమాలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజు యాదవ్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా రాజు యాదవ్ సినిమాను నిర్మించారు.. అయితే ఇప్పటివరకు విడుదలైన సినిమా అప్డేట్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. రాజు యాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే..

అయితే తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ తో మళ్ళీ వస్తాము. డబుల్ ఎనర్జీ తో త్వరలోనే కొత్త డేట్ వచ్చేస్తుందని శ్రీను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. త్వరలోనే ప్రమోషన్స్ ను మొదలు పెట్టి కొత్త డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం..

Show comments