NTV Telugu Site icon

Blood Tests Yearly : ఏడాది కోసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి

New Project 01

New Project 01

ప్రస్తుత తరుణంలో ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మన ఆరోగ్యం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మనం రోజువారీగా తీసుకునే ఆహారం, జీవన శైలితో మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ప్రతిఒక్కరూ అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత కంగారుపడుతుంటారు. ఈ సమస్యలు రాకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది సంవత్సరం ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు. అవేంటో చూద్దాం. శరీరంలో బాడీలో రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్​లెట్ల సంఖ్యను తెలుసుకోవడానికి CBC పరీక్షను సిఫార్సు చేస్తుంటారు. అలాగే ఈ టెస్ట్ మీ మొత్తం ఆరోగ్యం, రక్తహీనత, అంటువ్యాధులు, రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన రుగ్మతల నిర్ధారణ గురించి అవసరమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు.. ఈ పరీక్ష ప్రత్యేకంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎంతమొత్తంలో ఉందనే సమాచారాన్ని అందిస్తుంది.

Read more : Road Accident : జర్నీ సినిమా సీన్ రిపీట్.. రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు..

ఈ పరీక్షను ప్రతి సంవత్సరం తప్పక చేయించుకోవాలి. ఇదే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. మన బాడీలో థైరాయిడ్ గ్రంథి జీవక్రియ, శక్తి ఉత్పత్తి, వివిధ శారీరక విధుల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే ఈ గ్రంథి పనితీరులో ఏదైనా మార్పులు వస్తే అలసట, బరువులో మార్పులు, మానసిక సమస్యలు, హృదయ స్పందన రేటులో మార్పులు వంటి లక్షణాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాంప్రహెన్సివ్ మెటబాలిక్ ప్యానెల్ టెస్ట్ అనేది.. మన బాడీలో వివిధ జీవక్రియల, అవయవాల పనితీరును అంచనా వేసే ఒక సమగ్ర రక్త పరీక్ష. ఈ టెస్ట్.. రక్తంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్), మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్, బ్లడ్ యూరియా నైట్రోజన్), కాలేయ పనితీరు (బిలిరుబిన్, అల్బుమిన్, కాలేయ ఎంజైమ్‌లు), ప్రోటీన్ స్థాయిలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో తెలుపుతుంది.

తదుపరిది లిపిడ్ ప్రొఫైల్. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఇతర లిపిడ్ మార్కర్లను అంచనా వేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేయడానికి, మధుమేహం లేదా ప్రీడయాబెటిస్​ను గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. సాధారణంగా రెండు గ్లూకోజ్ టెస్ట్​లు ఉంటాయి. అందులో ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఇందుకోసం ఖాళీ కడుపుతో బ్లడ్ తీసుకుంటారు. హిమోగ్లోబిన్ A1C ఇది మరో గ్లుకోజ్ పరీక్ష. దీని ద్వారా రెండు నుంచి మూడు నెలల్లో మీ సగటు రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీలో మధుమేహం లేదా ప్రీ డయాబెటిస్ ఉంటే ఇట్టే తెలిసిపోతుంది.

Show comments