మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ “దేవర పార్ట్ 1”..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.దేవర సినిమాతోనే ఈ భామ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతుంది .ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు .ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నారు .ఈ సినిమాలో శ్రీకాంత్ ,ప్రకాష్ రాజ్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు .ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు .
నిజానికి ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 5 న విడుదల కావాల్సి వుంది .కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 10 కి వాయిదా పడింది .ఇదిలా ఉంటే మే 20 న ఎన్టీఆర్ బర్త్డే కానుకగా దేవర నుంచి ఫ్యాన్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఆశిస్తున్నారు.గత ఏడాది ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర టీం గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఎంతో సర్ప్రైజ్ చేసింది .ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్టీఆర్ బర్త్డే రానుంది . దేవర టీం ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్ ఏమి ఇస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు .తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్ గా దేవర టీం ఓ మాస్ బీట్ ను ఫ్యాన్స్ కు అందించనున్నట్లు సమాచారం .అనిరుద్ మ్యూజిక్ అందించిన దేవర ఫస్ట్ సింగల్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు . దీనికి సంబంధించి అధికారక ప్రకటన త్వరలోనే చేయనున్నారు . దీనితో దేవర మాస్ బీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .