Viral News: డ్యూటీ చేయకుండానే 16 ఏళ్లలో 11 కోట్లు జీతం తీసుకున్న టీచర్…
Viral News: ఓ 16 సంవత్సరాలుగా ఉద్యోగం చేయకుండానే 11 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారు. ఇప్పటికీ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఇది వింతగా అనిపిస్తుంది కదూ.. ఈ ఘటన జర్మనీలో జరిగింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు 2009 నుంచి.. అంటే 16 సంవత్సరాలుగా సెలవులో ఉన్నారు. ఇన్నేళ్లుగా ఆమె ఒక్క రోజు కూడా పాఠశాలకు రాలేదు. పని చేయలేదు. కానీ ప్రతి నెలా పూర్తి జీతం తీసుకుంటున్నారు. జర్మన్ వార్తాపత్రిక డై వెల్ట్ నివేదిక ప్రకారం.. అక్కడి ఉపాధ్యాయులకు ప్రతి నెలా దాదాపు 6,174 యూరోలు (సుమారు 6.3 లక్షల రూపాయలు) జీతం లభిస్తుంది. వారి వార్షిక ఆదాయం దాదాపు 72,000 యూరోలు (74 లక్షల రూపాయలు). అంటే 16 సంవత్సరాలలో ఈ మొత్తం 1 మిలియన్ యూరోలు (సుమారు 11.6 కోట్ల రూపాయలు) జీతం తీసుకున్నారు.
READ MORE: Khairatabad Ganesh Nimajjanam 2025 : హుస్సేన్‌సాగర్‌లో మహాగణపతి విగ్రహం
Also Read
- IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ఇటీవల, పాఠశాలకు కొత్త ఉన్నతాధికారులు వచ్చారు. వారు ఈ అంశంపై దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ ప్రతి నెలా వైద్య ధృవీకరణ పత్రాలను సమర్పిస్తోందని, కానీ అధికారిక వైద్య పరిశీలకులెవరూ ఆమె అనారోగ్యాన్ని పరీక్షించలేదని దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్ర అధికారులు ఆమెను వైద్య పరీక్ష చేయించుకోవాలని కోరారు. కానీ.. ఆ మహిళ నిరాకరించి, బదులుగా ఉన్నతాధికారులపై కేసు వేసింది. జర్మన్ కోర్టు ఆ మహిళ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అనారోగ్య రుజువు అడిగే హక్కు ఉన్నతాధికారులకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు, ఆ మహిళ 2,500 యూరోలు (సుమారు 2.9 లక్షల రూపాయలు) చట్టపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ సుదీర్ఘ సెలవులో ఆ మహిళ ఒక మెడికల్ స్టార్టప్‌ను కూడా ప్రారంభించిందని నివేదికలు వస్తున్నందున ఈ విషయం మరింత వివాదాస్పదమైంది. ఇది రుజువైతే, అది నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. ఉద్యోగం, జీతం, పెన్షన్ ప్రయోజనాలను కోల్పోవలసి రావచ్చు.
తాజావార్తలు
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్‌కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!