Site icon NTV Telugu

Viral News: డ్యూటీ చేయకుండానే 16 ఏళ్లలో 11 కోట్లు జీతం తీసుకున్న టీచర్…

Viral

Viral

Viral News: ఓ 16 సంవత్సరాలుగా ఉద్యోగం చేయకుండానే 11 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారు. ఇప్పటికీ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఇది వింతగా అనిపిస్తుంది కదూ.. ఈ ఘటన జర్మనీలో జరిగింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు 2009 నుంచి.. అంటే 16 సంవత్సరాలుగా సెలవులో ఉన్నారు. ఇన్నేళ్లుగా ఆమె ఒక్క రోజు కూడా పాఠశాలకు రాలేదు. పని చేయలేదు. కానీ ప్రతి నెలా పూర్తి జీతం తీసుకుంటున్నారు. జర్మన్ వార్తాపత్రిక డై వెల్ట్ నివేదిక ప్రకారం.. అక్కడి ఉపాధ్యాయులకు ప్రతి నెలా దాదాపు 6,174 యూరోలు (సుమారు 6.3 లక్షల రూపాయలు) జీతం లభిస్తుంది. వారి వార్షిక ఆదాయం దాదాపు 72,000 యూరోలు (74 లక్షల రూపాయలు). అంటే 16 సంవత్సరాలలో ఈ మొత్తం 1 మిలియన్ యూరోలు (సుమారు 11.6 కోట్ల రూపాయలు) జీతం తీసుకున్నారు.

READ MORE: Khairatabad Ganesh Nimajjanam 2025 : హుస్సేన్‌సాగర్‌లో మహాగణపతి విగ్రహం

ఇటీవల, పాఠశాలకు కొత్త ఉన్నతాధికారులు వచ్చారు. వారు ఈ అంశంపై దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ ప్రతి నెలా వైద్య ధృవీకరణ పత్రాలను సమర్పిస్తోందని, కానీ అధికారిక వైద్య పరిశీలకులెవరూ ఆమె అనారోగ్యాన్ని పరీక్షించలేదని దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్ర అధికారులు ఆమెను వైద్య పరీక్ష చేయించుకోవాలని కోరారు. కానీ.. ఆ మహిళ నిరాకరించి, బదులుగా ఉన్నతాధికారులపై కేసు వేసింది. జర్మన్ కోర్టు ఆ మహిళ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అనారోగ్య రుజువు అడిగే హక్కు ఉన్నతాధికారులకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు, ఆ మహిళ 2,500 యూరోలు (సుమారు 2.9 లక్షల రూపాయలు) చట్టపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ సుదీర్ఘ సెలవులో ఆ మహిళ ఒక మెడికల్ స్టార్టప్‌ను కూడా ప్రారంభించిందని నివేదికలు వస్తున్నందున ఈ విషయం మరింత వివాదాస్పదమైంది. ఇది రుజువైతే, అది నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. ఉద్యోగం, జీతం, పెన్షన్ ప్రయోజనాలను కోల్పోవలసి రావచ్చు.

Exit mobile version