Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు భారత్‌లోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ సమావేశంలో.. ఏపీలో పెట్టుబడులు, ఆ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ వివరించారు.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. అయితే, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి వివిధ రంగాలలో ఆంధ్రప్రదేశ్ సర్కార్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి వివరించారు జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్.. ఏపీని ఫోకస్డ్ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: Aadhaar updated Free: ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్పటి వరకు ఫ్రీ..
కాగా, విశాఖలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్-2023)ను నిర్వహించిన విషయం విదితమే.. 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని.. ఓవరాల్ గా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు గతంలోనే వివరించారు సీఎం జగన్.. ఇక, పెట్టుబడులకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనలో ఆలస్యం చేయరాదని, ఏపీ ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాము చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నామని, పర్యావరణ హిత ఇంధన, శక్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు పాటు పడుతున్నామని.. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చి దిద్దడమే తమ లక్ష్యమని జీఐఎస్ విజయవంతం అయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.