NTV Telugu Site icon

Geethu Royal : ప్రతి రోజూ ఆ పనిచెయ్యలేక నరకం చూస్తున్న..

Geethu

Geethu

బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యూట్యూబర్ గా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ లో కూడా మెరిసింది.. అక్కడ తన యాట్టిట్యూడ్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో పాటు అనేక షోలలో కూడా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ సీజన్ కి బిగ్బాస్ బజ్ షో కి యాంకర్ గా కూడా వ్యవహరించింది.. ప్రస్తుతం యాంకర్ ధనుష్ తో కలిసి యూట్యూబ్ లో సందడి చేస్తుంది.. అయితే తాజాగా ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది..

యాంకర్ ధనుష్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ వీడియోలో గీతూ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు.. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ కెరియర్ కొనసాగిస్తుందని.. అయితే ఇప్పుడు పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని వివరించారు.. అంతేకాదు ఆ వీడియోలో గీతూ కూడా మాట్లాడింది.. బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నాను. అక్కడ అనేక రకాల పదార్థాలను కూడా ట్రై చేశాను.. ముఖ్యంగా చనిపోయేలోపు అన్నీ చూడాలి.. ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతోనే తిన్నాను అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పింది..

ఈ వ్యాధి కోటిలో ఒకరికి మాత్రమే వస్తుంది.. అన్నీ రకాల ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు నాకు వచ్చింది. తాజాగా ఓ పెద్ద ఆసుపత్రికి వచ్చాను.. కడుపులో వచ్చిన ఈ వైరస్ వల్ల ప్రతిరోజు నరకం చూస్తున్నాను అంటూ గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో వైరల్ అవుతుంది…