Site icon NTV Telugu

Geethanjali Malli Vachindi: బేగంపేట్ శ్మశానవాటికలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ లాంచ్ ఈవెంట్.. టాలీవుడ్ చరిత్రలోనే..!

Geethanjali Malli Vachindi

Geethanjali Malli Vachindi

Geethanjali Malli Vachindi Movie Teaser Launch in Begumpet Cemetery: టాలీవుడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతుంది. అంజలి 50వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ రైటర్ కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్‌ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుదల అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది.

గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 24న నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే సరికొత్తగా బేగంపేట్ శ్మశానవాటికలో టీజర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్ బేగంపేట్ స్మశానవాటికలో ఈ శనివారం రాత్రి 7 గంటలకు’ అని చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్మశానవాటికలో టీజర్ లాంచ్ ఏంట్రా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ఈవెంట్‌ను స్మశానవాటికలో నిర్వహించడం విశేషం.

Also Read: Indus Appstore: గూగుల్‌ ప్లేకు పోటీగా.. ఇండస్‌ యాప్‌స్టోర్‌! ఇన్‌స్టాల్‌ ఎలా చేసుకోవాలంటే?

గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు స‌త్య, సునీల్‌, ర‌వి శంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో చాలా మంది కమిడియన్స్ ఉన్న నేపథ్యంలో ఎంతగా నవ్విస్తారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version