NTV Telugu Site icon

Vijay Devarakonda : ఒలింపిక్స్ వీడియోలో “గీతా గోవిందం”సాంగ్..

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,స్టార్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన “గీతా గోవిందం “సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ,రష్మిక పెయిర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తెరకెక్కిన గీతా గోవిందం మంచి విజయం సాధించింది.ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు.

Read Also :Ram Charan – Upasana Wedding Anniversary :12 వసంతాలు పూర్తి చేసుకున్న రామ్ చరణ్ దంపతులు, ఫోటో వైరల్

ఈ సినిమాలో గోపి అందించిన సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో “ఇంకేం ఇంకేం కావాలే”సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధించి టాప్ ట్రేండింగ్ లో నిలిచింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాటకు అరుదైన గౌరవం దక్కింది.పారిస్ ఒలింపిక్స్ వచ్చే నెల 26 న మొదలుకానున్నాయి.దీనితో ఒలింపిక్స్ అధికారిక ఇన్స్టాపేజీ ఆ పాటను తన ప్రమోషనల్ వీడియోలో వాడింది.దీనిపై హీరో విజయ్ దేవరకొండా స్పందించారు.’కొన్ని పాటలు ఎప్పటికి గుర్తుండిపోతాయి ‘అంటూ కాప్షన్ ఇచ్చి ఆ వీడియోను పంచుకున్నారు.