NTV Telugu Site icon

Gedela Srinubabu: ప్రజాస్వామ్య పరిరక్షణకు యువతే కీలకం..

Srinu

Srinu

విశాఖలోని అరుకులో భారతదేశం భవిష్యత్తును రూపొందించే కీలకమైన విషయాలపై యంగ్ థింకర్స్ ఫారం చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పల్సస్ గ్రూప్ అధినేత గేదెల శ్రీనుబాబు పాల్గొని ఎలక్షన్ సీన్ ఫోకస్ నావిగేట్ ఇన్ ది డెమొక్రటిక్ మేజ్, ప్రజాస్వామ్యం యువత యొక్క పాత్ర అనే అంశాలపై ప్రసంగించారు. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించటానికి ఇది మంచి వేదిక అని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఒక్క పాలన యొక్క రూపం మాత్రమే కాదు.. ఇది ఒక భావజాలం ప్రతి పౌరునికి శక్తిని ఇచ్చే జీవన విధానమని అన్నారు. భారతదేశం అంటే విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు కలిగి ఉన్నది. కానీ.. ఈ మతాలని ఈ సంస్కృతుల్ని అన్నింటిలో భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చి ఒకే ఒక వేడుక మన ప్రజాస్వామ్య విధానం అని గేదెల శ్రీనుబాబు చెప్పారు.

TTD: శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెల విశేష పర్వదినాలు ఇవే..

ప్రపంచంలోనే అతి ఎక్కువ యువ జనాభా ఉన్న ఏకైక దేశం మన భారతదేశం, మన యువత శక్తివంతమైన ఆలోచనలతో, సమ్మిళిత రాజకీయ భాగస్వామ్యంతో రాజకీయ చర్చలో చురుకుగా కలిసిపోయేలా చూసుకోవాలి.. ఇదే ప్రజాస్వామ్యానికి బంగారు కోట మరియు దేశ భవిష్యత్తుకు నాంది అని శ్రీనుబాబు చెప్పారు. ఎన్నికల ప్రక్రియను మరింత సులభంగా సురక్షితంగా చేయటానికి సాంకేతికత మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా పారదర్శకత న్యాయబద్ధత, జవాబుదారితనం సమస్యలను పరిష్కరించడానికి ఎన్నికలను ప్రక్రియలను క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ పార్టీలు ఏవైతే మేనిఫెస్టోలో పెడతాయో అవి అమలయ్యే విధంగా చూసుకోవలసిన బాధ్యత కూడా యువతరం మీద ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో యువత రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం కూడా ఉంది.. ఎందుకంటే మాట ఇవ్వడం తీరా అధికారంలోకి వచ్చా వాగ్దానాలను మరిచిపోవడం అనేది ప్రస్తుత రాజకీయ నాయకుల నైజం అని మండిపడ్డారు. ఈ నైజాన్ని ప్రశ్నించి ఎండగట్టి ఓటు అనే ఆయుధంతో మిగిలిన ఓటర్లనును కూడా ప్రభావితం చేసి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది శ్రీనుబాబు చెప్పారు.

Raj

MLC’s: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీలు ప్రొ. కోదండరాం, అమీర్ అలీఖాన్..

ప్రజాస్వామ్యం బలం దాని యొక్క పౌరుల సామూహిక జ్ఞానంలో ఉందని గుర్తుంచుకోండని శ్రీనుబాబు తెలిపారు. యంగ్ థింకర్స్ ఫారం మన యువత భవిష్యత్తు మాత్రమే కాదు వారు భారత దేశ సాధికారత కలిగిన వాస్తు శిల్పలు కలిసి పని చేద్దాం కలిసి ఆలోచించండి.. మన ప్రజాస్వామ్య ఆదర్శాలు యొక్క నిజమైన సారాన్ని ప్రతిభంబించే భవిష్యత్తును రూపొందిద్దాం అని శ్రీనుబాబు చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ సోమయాజులు, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, అరకు షీలా రెడ్డి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, కరుణా రాజు మాజీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ పంజాబ్ పాల్గొని ప్రసంగించారు.