Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ గాయత్రి గుప్తా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీపై విరుచుకుపడ్డారు. మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీకి ఉన్న అభిప్రాయాలను తప్పుబడుతూ ఆమె చేసిన ‘సావేజ్’ రిప్లై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక సందర్భంలో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుంటే బాగుంటుందని, వెస్ట్రన్ డ్రెస్సుల కంటే అదే గౌరవప్రదమని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన గాయత్రి గుప్తా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
నా ఇష్టం..‘నేను చీర కట్టుకోవాలా వద్దా అనేది నా ఇష్టం. ఎవరో శివాజీ గారు అన్నారని నేను చీర కట్టుకోను. నాకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అదే వేసుకుంటాను. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట.. అలా ఉంది ఆయన వ్యవహారం. చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించడం సరికాదు’ అంటూ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. గాయత్రి గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ‘డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత విషయం, ఆమె అన్నదానిలో తప్పేముంది?’ అని కొందరు గాయత్రిని సమర్థిస్తుంటే.. ‘శివాజీ గారు పెద్దవాడు, ఆయన ఒక సలహా ఇచ్చారు. దానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా?’ అని శివాజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మొత్తనికి మరో సారి శివాజి మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!