Gayatri Gupta: ఇంట్లో 10 కత్తులు దాచుకున్నా.. క్యాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ‘ఫిదా’, ‘కొబ్బరిమట్ట’ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా, వెండితెరపై ఎంత చలాకీగా కనిపిస్తారో, నిజ జీవితంలో అంతటి పోరాటాన్ని ఎదుర్కొన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న గాయత్రి, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గతంలోనే గొంతు ఎత్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, వరుస బ్రేకప్స్, ఒంటరిగా ఉంటున్నప్పుడు తన రక్షణ కోసం ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
Also Read : Raaka: ‘రాకా’ మ్యూజిక్.. అట్లీ విజన్ పై సాయి అభ్యంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
గాయత్రి మాట్లాడుతూ.. ‘ఒంటరిగా ఉండే అమ్మాయిలను సమాజం ఎంత చులకనగా చూస్తుందో నాకు తెలుసు. నేను రూమ్‌లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. అర్థరాత్రి 3, 4 గంటల సమయంలో డోర్లు కొట్టి నరకం చూపించేవారు. ఆ భయం నుండి నన్ను నేను కాపాడుకోవడానికి ఇంట్లో పది కత్తులు కొని దాచుకున్నాను. సోఫా వెనుక ఒకటి, టీవీ దగ్గర ఒకటి, కిచెన్‌లో ఒకటి.. ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ అందుబాటులో కత్తులు ఉంచుకున్నాను’ అని ఆమె తెలిపారు. అలాగే తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు ఐదుగురితో బ్రేకప్స్ జరిగాయి. నేను రిలేషన్‌షిప్‌లో చాలా లాయల్‌గా ఉంటాను. కానీ నా నిర్ణయాల వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు.. ఐదు బ్రేకప్స్ అయ్యాయి. ముఖ్యంగా చివరి బ్రేకప్ నన్ను చావు అంచు వరకు తీసుకెళ్లింది. ఆ ఎమోషనల్ పెయిన్ తట్టుకోలేక రెండేళ్ల పాటు నన్ను నేను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసుకున్నాను’ అని ఎమోషనల్ అయ్యారు. ఆ వ్యక్తి చాలా మంచివాడని, త్వరలో డైరెక్టర్ కాబోతున్నాడని కూడా ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఫెమినిజంపై గాయత్రి తనదైన శైలిలో స్పందించారు. ‘నాకు అబ్బాయిలతోనే హ్యాపీగా ఉంటుంది, వాళ్లే మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. బయట ఏదైనా సమస్య వస్తే అబ్బాయి వచ్చి గొడవపడతాడు. ఈ సమాజంలో సమానత్వం అనే కాన్సెప్టే లేదు. నిన్ను ఎవరైనా తొక్కుతున్నారు అంటే నువ్వు తొక్కనిస్తున్నావు అని అర్థం. ఏం జరిగినా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే’ అంటూ తన పవర్ ఫుల్ గా మాట్లాడారు గాయత్రి.
తాజావార్తలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!