Gautham Menon : మనశ్శాంతి లేదు.. ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరియు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’.అయితే ఈ మూవీకి ప్రారంభం నుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి కానీ, సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకి అయితే రావడం లేదు. వివిధ కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై దర్శకుడు తాజాగా స్పందించారు. ఈ సినిమా వల్ల మనశ్శాంతి కరువైందని, తనతో సహా ఫ్యామిలీ అంతా ఎంతో బాధను అనుభవిస్తున్నారని, ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదలపై మాట్లాడుతూ.. ”ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుండంతో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేకుండా పోయింది. నా కుటుంబం ఎంతగానో ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయం గురించే ఆలోచిస్తోంది. నాకు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తోంది. కానీ, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని ఉంటున్నాను.
మార్చి 1న ‘జాషువా’ సినిమా రిలీజ్ కానుంది. దీని కంటే ముందే ‘ధృవ నక్షత్రం’ విడుదల చేయాలని భావించాము కానీ, అది కుదరలేదు” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.’ధృవ నక్షత్రం’ సినిమా 2015 లోనే సెట్స్ మీదకు వెళ్ళింది. వీలయినంత త్వరగా పూర్తి చేసి 2017లో విడుదల చెయ్యాలని మేకర్స్ భావించారు.కానీ ఆర్థిక ఇబ్బందులతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నిలిచిపోయింది. గతంలో గౌతమ్ మీనన్ – శింబు కాంబినేషన్లో ఓ సినిమా కమిటై, పూర్తి చేయకపోవడంతో ఆల్ ఇన్ పిక్చర్స్ నిర్మాత కోర్టును ఆశ్రయించారు.రూ.2.40 కోట్లు అడ్వాన్స్ తీసుకొని కూడా సినిమాని పూర్తి చేయలేదని, డబ్బు తిరిగి ఇవ్వలేదని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.. నగదు తిరిగి చెల్లించేవరకూ ‘ధృవ నక్షత్రం’ విడుదలను ఆపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండంతో విడుదల వరుసగా వాయిదా పడుతుంది..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..