ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్.. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీకి సిద్ధమాయ్యాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు..
తాజాగా గౌతమ్ జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. గౌతమ్ వర్కౌట్లు మొదలు పెట్టేశాడు. గౌతమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మొదలైనట్టుగా కనిపిస్తోంది. గౌతమ్ తన బాడీని బిల్డ్ చేసుకుంటున్న విధానం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఇప్పటికే తండ్రీ కొడుకులను చూసి ఎవరు ప్రిన్స్ అని కన్యుఫ్యూజన్ అవుతున్నారు.. ఇప్పుడు గౌతమ్ బాడిని చూసి ఇద్దరు సేమ్ అని భావిస్తున్నారు..
ప్రస్తుతం గౌతమ్ జిమ్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో గౌతమ్ స్విమ్మింగ్ చేస్తున్నాడు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడు. చూస్తుంటే గౌతమ్ త్వరలోనే సిక్స్ ప్యాక్‌లో కూడా కనిపించేలానే ఉన్నాడే? అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఈ విధంగా వర్కౌట్స్ చెయ్యడం చూస్తే త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. ఓ సారి ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..