Site icon NTV Telugu

Gambhir vs Rohit Sharma: ఇదే నీ వీడ్కోలు మ్యాచ్.. రోహిత్ శర్మతో గంభీర్ వ్యాఖ్యలు వైరల్!

Gambir Rohit

Gambir Rohit

Gambhir vs Rohit Sharma: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ను టీమిండియా 0- 2 తేడాతో చేజార్చుకుంది. ఈ సందర్భంగా భారత్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మతో మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో గంభీర్, రోహిత్‌తో ఇలా అంటున్నాడు.. “రోహిత్, అందరికీ ఇది నీ వీడ్కోలు మ్యాచ్ అనుకుంటున్నారు.. కనీసం ఒక ఫోటో అయినా పెట్టండి” అని పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో నెట్టింట విస్తృతంగా షేర్ అవుతుంది. అయితే, గంభీర్ చేసిన ఈ కామెంట్స్ సరదాగా చేసిందా లేక నిజంగానే అన్నారా అనేదానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు.

Read Also: Pregnant Woman in Doli: ఏజెన్సీలో తప్పని కష్టాలు.. అర్ధరాత్రి 3 కిలో మీటర్లు పురిటి నొప్పులతో డోలీలో గర్భిణి..

కాగా, పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌తో తుది జట్టులోకి తిరిగి వచ్చిన రోహిత్, ఆ మ్యాచ్‌లో కేవలం ఎనిమిది రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ, అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో అతను 73 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక, శ్రేయాస్ అయ్యర్ ( 61) పరుగులతో కలిసి రోహిత్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా, రోహిత్‌ను ODI కెప్టెన్సీ నుంచి తొలగించినప్పటి నుంచి 2027 ODI ప్రపంచ కప్ జట్టులో అతడి స్థానంపై తీవ్రంగా చర్చ కొనసాగుతుంది.

Exit mobile version