Site icon NTV Telugu

Eden Garden Pitch: ఈడెన్ పిచ్‌పై గంభీర్ వ్యాఖ్యలు.. విమర్శలు గుప్పించిన దిగ్గజాలు..!

Eden Garden Pitch

Eden Garden Pitch

Eden Garden Pitch: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి తర్వాత ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్‌ను గట్టిగా సమర్థించడంతో మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, డేల్ స్టెయిన్‌లను ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే పిచ్‌పై “ఎలాంటి తప్పుడు అంశాలు లేవు” (No demons) అని గంభీర్ పదేపదే చెప్పడాన్ని మాజీ దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ విభేదించగా.. మాజీ భారత కోచ్ అనిల్ కుంబ్లే మాత్రం గంభీర్ వ్యాఖ్యలతో గందరగోళానికి గురయ్యారు. ఈ మ్యాచ్ కోసం మేనేజ్మెంట్ కోరుకున్న పిచ్ ఇదేనని గంభీర్ చెప్పడమే దీనికి కారణం.

మొదటి రోజు 11 వికెట్లు, రెండో రోజు మరో 16 వికెట్లు పడిన తర్వాత కోల్‌కతా పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గంభీర్ మాత్రం ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్‌ను గట్టిగా సమర్థించారు. అంతేకాకుండా.. తమ బ్యాటర్లు ఈ సవాలుతో కూడిన పిచ్‌పై ఒత్తిడిని తట్టుకుని పరుగులు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. అలాగే ఇది ఆడటానికి వీలు లేని వికెట్ కాదు, ఇందులో ఎలాంటి అంశాలు లేవని గంభీర్ అన్నారు. మేం కోరుకున్న పిచ్ ఇదే.. క్యూరేటర్ చాలా మద్దతుగా ఉన్నారన్నారు. మేం ఏం కోరుకున్నామో అదే లభించిందని.. సరిగ్గా ఆడనప్పుడు ఇలానే జరుగుతుందన్నాడు. ఇది పెద్ద షాట్లు ఆడటానికి వీలైన వికెట్ కాకపోవచ్చు. కానీ పట్టుదలతో ఉండి, తల దించుకుని ఆడటానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా పరుగులు చేయగలిగే వికెట్ ఇదని గంభీర్ అనడంతో ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది.

Ind vs Pak Cricketers Fight: మైదానంలో భారత్‌, పాకిస్థాన్ ప్లేయర్స్ మధ్య తీవ్ర ఘర్షణ.. గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు..?

గంభీర్ ఈ పరిస్థితులే తమకు కావాలని, క్యూరేటర్ సుజన్ ముఖర్జీ “చాలా సహాయకారిగా” ఉన్నారని చేసిన ప్రకటన అనిల్ కుంబ్లేను ఆశ్చర్యపరిచింది. ఈడెన్ గార్డెన్స్ చరిత్రను చూస్తే, ఇక్కడ ఎన్నో టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. నేను అండర్-19 ఆటగాడిని అయినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. టెస్ట్ మ్యాచ్‌లో మూడు రోజుల్లో ఇలా ప్రవర్తించే పిచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదని మ్యాచ్ తర్వాత జియోహాట్‌స్టార్‌లో కుంబ్లే అన్నారు. గౌతమ్ గంభీర్ చెప్పింది నేను విన్నాను.. జట్టు ఇలాంటి పిచ్‌నే కోరుకుందని అతను పేర్కొన్నాడు. అప్పుడు నాకు కొంచెం గందరగోళంగా అనిపించిందని.. ఎందుకంటే ఇది యువ జట్టు గురించి నాకు తెలుసునని పేర్కొన్నారు.

మరోవైపు మ్యాచ్ మూడో రోజు టీ సమయానికే ముగిసిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. పిచ్‌లో ఎన్నో అంశాలు ఖచ్చితంగా ఉన్నాయని డేల్ స్టెయిన్ గంభీర్ వ్యాఖ్యతో పూర్తిగా విభేదించారు. పిచ్‌లో ఎలాంటి అంశాలు లేవని అతను చెప్పారా? నాకు చాలా కనిపించాయని అదే ప్యానెల్‌లో ఉన్న స్టెయిన్ అన్నారు. అనిల్ కుంబ్లే చెప్పినట్లు కొన్ని బంతులు బ్యాట్ దాటి రెండు అడుగుల వరకు స్పిన్ అవుతూ కీపర్‌ భుజానికి తగులుతున్నాయి. మరొక బంతి కిందకు దూసుకువస్తూ ప్యాడ్‌కు తగిలి ఔట్ అవుతున్నారు. దీనిపై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. పరుగులు చేయడానికి బ్యాటర్లకు అవకాశం లేనప్పుడు డిఫెన్స్ ఆడటమే అతిపెద్ద కీలకంగా మారుతుందని.. దాని అర్థం బ్యాటింగ్ చాలా కష్టమని పేర్కొన్నారు.

Bus Fire: ప్రజా రవాణా భద్రతపై ఆందోళన.. ఒకేరోజు రెండు బస్సుల్లో అగ్నిప్రమాదాలు..!

అలాగే గత ఏడాది డిసెంబర్ వరకు గంభీర్ కోచింగ్ టీమ్‌లో ఉన్న మాజీ భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను కేవలం టర్నర్‌గా పిలవడానికి నిరాకరించారు. స్పిన్నర్ల మాదిరిగానే సీమర్‌లు కూడా ప్రభావం చూపారని గంభీర్ అభిప్రాయంతో అతను ఏకీభవించినప్పటికీ.. పిచ్‌ను సిద్ధం చేయడంలో లోపాలను ఎత్తి చూపారు. దీని కారణంగానే పిచ్ వేరియబుల్ బౌన్స్‌ను అందించిందని అశ్విన్ పేర్కొన్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను టర్నర్ అని ఎవరైనా పిలిస్తే నేను అస్సలు అంగీకరించనన్నారు. సరిగ్గా పిచ్‌ను సిద్ధం చేయడంలో లోపం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన పిచ్ అనే అంశంతో నేను ఏకీభవిస్తాను. కానీ నా అభిప్రాయం ప్రకారం టర్నర్ ఇవ్వండి.. కానీ, టర్నర్ పిచ్ ఇవ్వడానికి కొన్ని ఉపరితలాలు మాత్రమే ఉన్నాయి. మీరు ఈడెన్ గార్డెన్స్‌లో టర్నర్‌ను ఇవ్వలేరు. అక్కడ టర్నర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే వికెట్ ఇలాగే మారుతుందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

Exit mobile version