NTV Telugu Site icon

Gowtham Gambhir: న్యూజిలాండ్‌తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?

Gowtham

Gowtham

Gowtham Gambhir: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో 0-3తో ఘోర పరాజయం తర్వాత గౌతం గంభీర్ తొలిసారిగా మౌనం వీడాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. భారత కోచ్‌గా గౌరవనీయమైన పాత్రను పోషించడం చాలా కష్టమని, అది తనకు తెలుసునని అన్నాడు. న్యూజిలాండ్‌తో ఓటమి 2012 తర్వాత స్వదేశంలో భారత్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కాగా.. ఈ శతాబ్దంలో స్వదేశంలో 0-3 తేడాతో ఓటమి పాలైంది.

Read Also: Hyderabad: ఆరాంఘర్‌లో అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు

ఇకపోతే, టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు దాదాపు పది రోజుల ముందే బయల్దేరింది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్‌ గంభీర్‌ కొన్ని విషయాలను తెలిపాడు. తమకు ఆసీస్‌ చేతిలో ఓటమి తప్పదని, సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ ఫామ్‌పై చేస్తున్న విమర్శలను కోచ్ గౌతమ్‌ గంభీర్ కొట్టిపడేశాడు. టీమిండియా కుర్రాళ్లకు ఎప్పుడూ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే.. మరోవైపు ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ పైనా ఆయన స్పందించాడు. మొత్తానికి పెద్దమార్పులేమి లేకుండా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కు తాము సిద్ధమని ఆయన తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని పరిస్థితులు ఎదుర్కోవడం చాలా కఠినమని ఆయన అన్నాడు. అక్కడి పరిస్థితులు ఇక్కడితో పోలిస్తే చాలా విభిన్నమన్నారు.

Read Also: Dulquer Salmaan : సెంచరీకి చేరువలో ‘లక్కీ భాస్కర్’

అలాగే, టీమిండియా ఇప్పటికే చాలాసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన అనుభవం ఉందని.. అది తమకు తప్పకుండా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ఆస్ట్రేలియా సిరీస్‌లో మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. మరోవైపు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత రోహిత్‌, తన మధ్య దూరం పెరిగిందనే వార్తలూ వచ్చాయని, కివీస్‌తో అద్భుతంగా పోరాడమని, కాకపోతే లక్‌ కలిసిరాలేదని అన్నారు. అలాగే రోహిత్‌ తో నా అనుబంధం చాలా గొప్పగా ఉందని వివరించాడు .