Site icon NTV Telugu

Gas Cylinder Price Hike: వంటింట్లో మంట.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

Gas Cylinder

Gas Cylinder

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సిలిండర్ ధరను రూ. 50 పెంచారు. ఉజ్వల పథకం సిలిండర్లపైనా రూ.50 వడ్డించారు. గతంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఓ వైపు నిత్యావరసర ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ గ్యాస్ ధరలు కూడా మరింత పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Also Read:Gas Cylinder Price Hike: వంటింట్లో మంట.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

గత కొన్ని నెలలుగా 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పు ఉండగా, 14.2 కిలోల సిలిండర్ ధరను చివరిగా గత సంవత్సరం ఆగస్టు 2024లో మార్చారు. ప్రస్తుతం ఢిల్లీలో LPG సిలిండర్ ధర రూ. 803. ముంబైలో ధర రూ. 802.50, కోల్‌కతాలో రూ. 829, చెన్నైలో LPG సిలిండర్ ధర రూ. 818.50గా ఉంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్-డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని రూ. 2 పెంచారు. ఈ పెంపు ప్రభావం సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపించదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version