NTV Telugu Site icon

Garlic Price: ఎల్లిగడ్డకు కిలో రూ.500.. పంటపొలాల్లో సీసీ కెమెరాలు..

Elligadda

Elligadda

Garlic price: అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్‌ దాటింది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది. దీంతో వంటి గది నుంచి అల్లం, వెల్లుల్లి కనుమరగైతున్నాయి. రెండు వారాల్లోనే వీటి ధరలు రెట్టింపు అయింది. కూరల్లో ప్రధానంగా ఉండే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, దేశంలోని ప్రధాన నగరాల్లో వెల్లుల్లి ధర భారీగా పెరిగి కిలో 500-550 రూపాయల మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. రెండు వారాల తర్వాత కొత్త పంట వస్తే ధరలు తగ్గే ఛాన్స్ ఉందని వ్యాపారులు అంటున్నారు. వెల్లుల్లి తక్కువ సరఫరాలో స్థానిక పొలాల నుంచి నగరాలకు వస్తుందంటున్నారు.

Read Also: JSW Steel : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చెందిన రూ.65 వేల కోట్ల ప్లాంట్‌ పనులు ప్రారంభం

కాగా, ఇప్పుడు ఎల్లిగడ్డలు బహిరంగ మార్కెట్ లో కిలో ధర 500 రూపాయలకు పెరిగింది. దీంతో పంట పొలాల నుంచే వాటిని కొందరు దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయని తెలిపారు.

Read Also: LIC Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్‌.. ఎల్‌ఐసీకి రూ.22 వేల కోట్ల లాభం

అయితే, గత 60 ఏళ్లలో ఎప్పుడూ వెల్లుల్లి ధరలు ఇంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు ధనవంతులయ్యారు.. కానీ ఇప్పుడు తాము పండించిన పంట చోరీకి గురవుతుందనే భయంతో ఉన్నారు. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో దాదాపు 1,500 హెక్టార్ల భూమిలో వెల్లుల్లి పంటను పండిస్తారు.. జిల్లాలో ఉద్యాన పంటల మొత్తం విస్తీర్ణం లక్షా 30 హెక్టార్లు ఉంది. 2023లో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు పంట వేయడానికి ఆసక్తి చూపలేదు.. సగటు ఉత్పత్తి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు తెలిపారు.

Show comments