NTV Telugu Site icon

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.. అయితే, వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది కోర్టు.. వంశీతో పాటు అరెస్ట్‌ అయిన మరో నలుగురు నిందితుల రిమాండ్‌ ఇవాళ్టితో ముగియనుండడంతో.. వర్చువల్ గా నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.. దీంతో, మార్చి 11వ తేదీ వరకు వల్లభనేని వంశీ సహా నిందితుల రిమార్డ్ పొడిగించారు.. మరోవైపు.. వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.. మొదట నిందితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఆ తర్వాత ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు.. మూడు రోజుల పాటు వల్లభనేని వంశీతో పాటు ముగ్గురిని ప్రశ్నించనున్నారు పోలీసులు..

Read Also: Errabelli Dayakar Rao: ప్రభుత్వం మిర్చి రైతును ఆదుకోవాలి.. క్వింటాకు 25 వేల మద్దతు ధర చెల్లించాలి!

కాగా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఉచ్చు బిగిస్తోంది.. వంశీ 2014 నుంచి 2024 వరకు పదేళ్లపాటు గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు.. 2019 టీడీపీ నుండి గెలిచి వైసీపీకి జై కొట్టారు.. ఆ సమయంలో వంశీ, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కబ్జాలు మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడినట్లు విజిలెన్స్ ఇప్పటికే నివేదికలో గుర్తించినట్టు సమాచారం. దీనిపై త్వరలో కేసు నమోదు అవుతుందని భావిస్తున్న వేళ ప్రత్యేకంగా వంశీ చేసిన అక్రమాలపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం కొత్తగా నలుగురు అధికారుల బృందంతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఏలూరు డీఐజీగా ఉన్న అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సిట్ పని చేస్తుంది. వంశీ వ్యవహారాల వల్ల అక్రమాల వల్ల ప్రభుత్వానికి సుమారు 200 కోట్లు నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వేసినట్టు తెలుస్తుంది. ఇక, గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసిన సత్య వర్ధన్ తన ఫిర్యాదు వెనక్కి తీసుకోవటనికి వంశీ, ఆయన వర్గీయులు కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారనే కేసులో ఇప్పటికే వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మూడు రోజులు కష్టడీకి వంశీని ఇవ్వటానికి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది.. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో వంశీని ఆ కేసులో కోర్టులో హాజరపరచటానికి సిఐడి పిటివారిని కూడా దాఖలు చేసింది. మరోవైపు గన్నవరం పరిధిలో వంశీ పై నమోదైన పలుకేసుల్లో కూడా ఆయన విచారించడానికి వీటి వారంట్లను దాఖలు చేయడానికి కృష్ణాజిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారు. దీంతో అన్ని రకాలుగా వంశీ పై నమోదైన కేసులతో పాటు ఎమ్మెల్యేగా చేసిన అక్రమాలపై కూడా కొత్త కేసులు నమోదు చేసి.. వంశీ చుట్టూ ప్రభుత్వం వచ్చి బిగించడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అని తెలుస్తోంది..