Site icon NTV Telugu

Ganja In Sangareddy: భారీగా గంజాయి పట్టివేత.. మూడు కిలోల గంజాయి సీజ్..

Ganja

Ganja

Ganja In Sangareddy: తాజాగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ (మం) డాకూర్ శివారులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా 3 కిలోల గంజాయిని పట్టుకున్నారు. బైక్ పై మోహియోద్దీన్ అనే వ్యక్తి గంజాయి తీసుకువెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బైక్ ని సీజ్ చేసి మోహియోద్దీన్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Barber: ముఖంపై ఉమ్మేస్తూ మసాజ్ చేసిన బార్బర్.. వీడియో వైరల్ కావడంతో పరార్..

గత కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రలలో ఈ గంజాయి సంబంధించిన అనేక దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న దంగతి తెలిసిందే. పెద్ద అంబర్ పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్‌ లో రవాణా చేస్తున్న దాదాపు 800 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాంతో ఆ కంటైనర్ డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసారు.

Attempt to Murder: భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..

Exit mobile version