Site icon NTV Telugu

Sangareddy: ఇస్నాపూర్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత

Ganja Chocolates

Ganja Chocolates

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గంజాయి చాక్లెట్స్ పట్టుకున్నారు. ఓ కిరాణంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. ఒక వ్యక్తి బైక్ పై వచ్చి గంజాయి చాక్లెట్లు, ఎండు గజాయి అమ్ముతుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 100 గజాలు చాక్లెట్లు ,58 గ్రాముల ఎండు గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బీహార్ కి చెందిన రాజ్ కుమార్ అనే నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

Exit mobile version