Site icon NTV Telugu

Chennai: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్ల కలకలం.. స్నేహితుడైన ఓ ఖైదీ కోసం గంజాయి ఇవ్వడానికి వెళ్ళి..

Ganja

Ganja

చెన్నై సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం సృష్టించాయి. సేలం సెంట్రల్ జైలులో ఉన్న స్నేహితుడైన ఓ ఖైదీకి గంజాయి ఇవ్వడానికి వెళ్లాడు ఓ యువకుడు. బిస్కెట్ల ఫ్యాకేట్ ఓపెన్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు జైలు సిబ్బంది. బిస్కె్ట్లలో గంజాయి తరలించడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. బిస్కెట్లకు రంధ్రం చేసి వాటిలో గంజాయి పెట్టి తీసుకొచ్చాడు ఆ యువకుడు. బిస్కెట్ ప్యాకెట్‌లో దాచిన 80 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.

Also Read:Ananya Pandey : ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురుకున్నా..

ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. యువకుడు మహ్మద్ సుకిల్‌ను పోలిసులకు అప్పగించారు సేలం జైలు అధికారులు. పోలీసుల విచారణలో స్నేహితుడు కోరడంతోనే గంజాయి తీసుకొచ్చినట్లు యువకుడు అంగీకరించాడు.సేలం సెంట్రల్ జైలులో వెయ్యి మందికి పైగా ఖైదీలు ఉన్నారు. గట్టి భద్రత ఉన్నప్పటికీ, వారిలో కొందరు సెల్ ఫోన్లు, గంజాయి వంటి మాదకద్రవ్యాలను ఉపయోగిస్తుండడంతో ఆందోళన నెలకొంది.

Exit mobile version