NTV Telugu Site icon

Sourav Ganguly: యశస్వి ఇన్నింగ్స్పై గంగూలీ ఇంప్రెస్.. ప్రపంచ కప్లో ఆడాలి

Gangluy

Gangluy

వెస్టిండీస్‌ తో టెస్ట్ సిరీస్ తో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాలో ఆడాలని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరుకున్నాడు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే 171 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో యశస్వి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు. యశస్వి ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసిన గంగూలీ చాలా ఇంప్రెస్ అయ్యాడు. యశస్వి తన ఇన్నింగ్స్‌తో గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మెన్‌గా యశస్వి నిలిచాడు. అతనికి ముందు 1996లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 131 పరుగులు చేసిన రికార్డు గంగూలీ పేరిట ఉంది.

Sonia Gandhi: సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్

మరోవైపు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ యశస్విపై గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో యశస్విని చూడాలని గంగూలీ చెప్పాడు. ఒక ఆటగాడు తన కెరీర్‌లో చాలా దూరం వెళ్లడానికి అవసరమైన స్వభావం మరియు నైపుణ్యాలు యశస్విలో ఉన్నాయని గంగూలీ అభిప్రాయపడ్డాడు. తాను వన్డే ప్రపంచకప్ జట్టులో యశస్విని ఎందుకు చూడాలనుకుంటున్నానో దానికి కారణాన్ని కూడా గంగూలీ చెప్పాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లంటే తనకు ఎప్పుడూ ఇష్టమని, టాప్ ఆర్డర్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లను చూడటం తనకు ఇష్టమని గంగూలీ అన్నాడు. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఎటాక్ ఒత్తిడిలో పడుతుందని బీసీసీఐ మాజీ చైర్మన్ అన్నారు. చైనాలో జరిగే ఆసియా క్రీడల జట్టులో యశస్వి ఎంపికైనప్పటికీ.. ఆసియా క్రీడలు ముగిసిన కొద్ది రోజులకే భారత్ లో ప్రపంచకప్‌ జరుగనుంది. మరీ అందులో యశస్వి ఆడుతాడో లేదో చూడాలీ మరి.