గత ఏడాది డిసెంబరర్ లో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు ఈ ఏడాది సమ్మర్ కి విడుదల తేదిని వాయిదా వేసాయి.. అలాగే డిసెంబర్ లో ఎలాగైనా తన సినిమాను రిలీజ్ చేసి తీరుతాను అని మాటిచ్చిన విశ్వక్ సేన్..పలు కారణాల వల్ల మాటను నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా సమ్మర్లో విడుదల కానున్నట్టు అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు విశ్వక్ సేన్. ఈ పోస్టర్ లో మూవీలో కీలక పాత్రలు పోషించిన నటులు అందరూ ఉన్నారు.ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన పోస్టర్లు చూస్తుంటే గోదావరి జిల్లాల్లో తెరకెక్కే ఒక పక్కా కమర్షియల్ సినిమా అని అర్థమవుతోంది.
అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా కూడా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల సినిమా రిలీజ్ లేట్ అయ్యిందని సమాచారం… థియేటర్లలో ఎప్పటికప్పుడు తెలుగు సినిమాల మధ్య పోటీ నడుస్తుండడంతో ఆ పోటీ మధ్య మేకర్స్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని రిలీజ్ చేయలేకపోయారు. అందుకే చివరికి 2024 మార్చిలో ఈ చిత్రం విడుదలను మేకర్స్ ఫైనల్ చేశారు.2024 మార్చి 8న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో విశ్వక్ సేన్తో పాటు హైపర్ ఆది, గోపరాజు రమణ, ప్రవీణ్ మరియు మధు తదితర నటులు ఉన్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటించింది. ఈ చిత్రం లో హీరోయిన్ అంజలి మరొక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విశ్వక్, నేహా కాంబినేషన్లో ‘సుట్టంలా చూసి’ అంటూ సాగే సాంగ్ విడుదలయ్యి చాట్ బస్టర్ గా నిలిచింది..ఈ పాటలో నేహా శెట్టి గ్లామర్ కి యూత్ ఫిదా అవుతున్నారు.
https://www.instagram.com/p/C1i_ZZTIbXC/?igsh=MW9hYmMzdXhweWR6bg==