Site icon NTV Telugu

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్టు

నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరి ముఖ్యంగా 2000, 500 నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు ముఠా యత్నంచింది. కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహారించి కేసును చేదించారు.

సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘నిందితుల నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, లక్ష ముప్పై వేల ఒరిజినల్ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలందరూ అప్రమతంగా ఉండాలి. దొంగ నోట్లకి, ఒరిజినల్ నోట్లకి తేడా ఉందని అందరూ గమనించాలని..’ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

Exit mobile version