Site icon NTV Telugu

Fruad: దండంరా దూత.. భార్య, ప్రియురాలితో కలిసి.. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. రూ.3.8 కోట్లు వసూలు

Ap

Ap

ఈజీగా డబ్బు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు కొందరు వ్యక్తులు. తాజగా కర్నూలులో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్య ప్రియురాలితో కలిసి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఆన్ లైన్ లో న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కి చెందిన భార్య భర్త మల్లేష్, మేరీ, మల్లేష్ ప్రియురాలు మల్లికగా గుర్తించారు.

Also Read:Telangana : తెలంగాణలో పోటాపోటీగా బతుకమ్మ వేడుకలు.. పూలతో పులకరించిన రాష్ట్రం

అక్రమంగా డబ్బులు సంపాదించాలని కుట్ర పన్ని ట్విట్టర్ లో సంయుక్త రెడ్డి అని ఐడీ క్రియేట్ చేశారు నిందితులు. న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేసాలకు తెగబడ్డారు. కర్నూలు కు చెందిన శ్రావణ్ అనే వ్యక్తిని విలువైన పొలాలు తక్కువ ధరకు అమ్ముతామని పరిచయం చేసుకున్నారు. న్యూడ్ కాల్స్ తో రూ.3.8 కోట్లు వసూలు చేసింది ముఠా. నిందితుల నుంచి రూ.41 లక్షల రూపాయలు విలువ చేసే కార్లు, బైక్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ.3.38 కోట్లు విలాసాలకు మోసగాళ్ళు ఖర్చు చేసినట్లు గుర్తించారు.

Exit mobile version