Site icon NTV Telugu

Kabaddi Tournament: కబడ్డీ మ్యాచ్‌లో కొట్టుకున్న రెండు వర్గాలు..కత్తులు, తుపాకీలతో దాడి

Fight

Fight

Kabaddi Tournament: ఆటల పోటీలు ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ జట్టు గెలిచినా, ఏ జట్టు ఓడిపోయినా ఇరుజట్ల దానిని స్పోర్టివ్ గా తీసుకోవాలి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆటల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి కొట్టుకోవడంతో ఆగకుండా కత్తులతో దాడి చేసుకునే వరకు కూడా వెళుతూ ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి బ్రిటన్‌లోని డెర్బిషైర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రిటన్‌లోని డెర్బిషైర్‌ లో రెండు జట్ల మధ్య జబర్ధస్త్ ఫైట్ జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరికి ఉచితంగా మద్యం, కబాబ్ లు ఇవ్వడం వల్లే ఇలా జరిగింది. దీని వల్ల ఒక్కసారిగా పంజాబీలందరూ నవాబులు అయిపోయారు అంటూ వీడియోకు క్యాప్షన్ జోడించి ఎక్స్ ( ట్విటర్) లో పోస్ట్ చేశారు.

Also Read: Harassment of Bride: అయ్యో పాపం.. కొత్త పెళ్లికూతురి బట్టలు విప్పించి శీల పరీక్ష చేసిన అత్తామామ

ఈ వీడియో ప్రకారం కబడ్డీని వీక్షించేందుకు వచ్చిన జనం తన్నుకున్నారు. రెండు గ్యాంగ్ లుగా విడిపోయిన వారు దారుణంగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో కబడ్డీ జరగాల్సిన ప్రదేశం రణరంగంగా మారింది. అక్కడ రక్తం పారింది. ఆ సమయంలో వారిలో చాలా మంది మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. టోర్నమెంట్ కు వచ్చిన వారికి ఉచితంగా మందు, మాంసం అందించారు. దీంతో వీటిని తాగిన వారు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. హాకీ స్టిక్‌లతోనూ రెండు గ్యాంగ్‌లు అటాక్ చేసుకున్నాయి.అంతే కాకండా కొందరు కత్తులతో అటాక్ చేశారు. మధ్యలో తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయి. అంటే అక్కడ ఉన్నవారు తుఫాకి కాల్పులు కూడా జరిపారు. దీంతో అక్కడికి వచ్చిన జనం భయంతో పరుగులు తీశారు. ఈ గొడవ పెద్దది కావడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు సుమారు 20 కార్లలో పోలీసులు వచ్చారు. అల్లర్లకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు. అయితే గొడవకు గల అసలు కారణం తెలియరాలేదు. అంతేకాకుండా ఈ గొడవలో ఎంతమంది గాయపడ్డారు అనే వివరాలు కూడా తెలియలేదు. అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియో మాత్రం పస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు మరీ ఆట కోసం ఇంత గొడవ చేస్తారా? తాగితే ఇలానే చేస్తారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version