Site icon NTV Telugu

Ganesh Immersion Live Updates: గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ సడన్ సర్‌ప్రైజ్‌

Ganesh Immersion

Ganesh Immersion

Ganesh Immersion Live Updates: గణేష్‌ నిమజ్జనం అంటే.. వెంటనే గుర్తుకు వచ్చేది హైదరాబాద్‌.. గణపయ్యలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. గణపయ్యలకు బైబై చెబుతూ.. గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.. గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులతో పాటు.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుండగా.. ఈ రోజు కీలక నిమజ్జనం జరగనుంది.. అటు బాలాపూర్‌ గణపతి.. ఇటు ఖైరతాబాద్‌ బడా గణేష్‌.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా.. ఇక, నగరం నలువైపుల నుంచి సాగరం వైపు కదుతున్నారు గణనాథులు..

The liveblog has ended.
  • 06 Sep 2025 10:12 PM (IST)

    నిమజ్జనాల కోసం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 40 క్రేన్లు..

    నిమజ్జనాల కోసం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 40 క్రేన్లు ఉన్నాయి.. క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రధాన మానిటరింగ్‌ కేంద్రం నుంచి పరిశీలిస్తున్నాం.. మండపాల నిర్వాహకులు అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నారు.. శోభాయాత్రలో డీజేలు వాడకుండా చర్యలు తీసుకున్నాం: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌

  • 06 Sep 2025 09:03 PM (IST)

    వినాయకుని ఊరేగింపులో ఉద్రిక్తత..

    నందిగామ: కంచికచర్ల (మం) పరిటాల వద్ద ఉద్రిక్తత.. వినాయకుని ఊరేగింపులో రెండు వర్గాల మధ్య వివాదం.. వినాయక విగ్రహం ఊరేగింపులో రాళ్లు విసిరిన ఓ వర్గం.. ఇద్దరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు.. గణేష్ ఊరేగింపులో పాటలు పెట్టే విషయంలో గొడవ..

  • 06 Sep 2025 08:41 PM (IST)

    తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆగిన వినాయక విగ్రహాల శోభాయాత్ర

    తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆగిన వినాయక విగ్రహాల శోభాయాత్ర.. బీఆర్కే భవన్ దగ్గర అడ్డంగా విద్యుత్ వైర్లు.. విగ్రహాలకు అడ్డంకిగా ఉండటంతో నిలిచిన ట్రాఫిక్.. ముందస్తు ఆలోచన చేయని విద్యుత్ శాఖ అధికారులు.. భారీగా ట్రాఫిక్ జామ్..

  • 06 Sep 2025 07:24 PM (IST)

    ఎక్కడికక్కడ నిలిచిపోయిన గణనాథుల వాహనాలు

    చార్మినార్‌ వద్ద ఎక్కడికక్కడ నిలిచిపోయిన గణనాథుల వాహనాలు. శాలిబండ నుండి చార్మినార్‌ మీదుగా గుల్జార్‌ హౌస్‌, మదీనా, ఆఫ్జల్‌ గంజ్‌ వరకు నిలిచిపోయిన వాహనాలు.

  • 06 Sep 2025 07:22 PM (IST)

    రాత్రంతా తిరగనున్న MMTS రైళ్లు

    HYD: రాత్రంతా తిరగనున్న MMTS రైళ్లు. రేపు ఉదయం 4.40 వరకు తిరగనున్న MMTS రైళ్లు. వినాయక నిమజ్జనం సందర్భంగా రైల్వే శాఖ నిర్ణయం. సికింద్రాబాద్‌-ఫలక్‌ నుమా.. సికింద్రాబాద్‌-హైదరాబాద్‌. హైదరాబాద్‌-లింగంపల్లి.. లింగంపల్లి-ఫలక్‌నుమా. ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ మధ్య తిరగనున్న 8 MMTS రైళ్లు.

  • 06 Sep 2025 06:01 PM (IST)

    గణనాథులపై విమానంతో పూలవర్షం..

    ముంబయిలో ఘనంగా నిమజ్జన కార్యక్రమం.. నగరంలోని ప్రధాన వీధులు, రహదారులపై భారీ గణపతి విగ్రహాల ఊరేగింపు.. నిమజ్జన మార్గమధ్యలో గణనాథులపై విమానంతో పూలవర్షం.. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు.. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు..

  • 06 Sep 2025 05:59 PM (IST)

    గణపయ్య నిమజ్జనంలో మహారాష్ట్ర సీఎం..

    దేశవ్యాప్తంగా వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న బొజ్జగణపయ్య నిమజ్జన కార్యక్రమం.. ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ దంపతులు..

  • 06 Sep 2025 05:53 PM (IST)

    తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకి చేరుకున్న బాలాపూర్ గణేష్..

    తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గరికి చేరుకున్న బాలాపూర్ వినాయక విగ్రహం. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుండి.. ట్యాంక్ బండ్ వైపు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర.

  • 06 Sep 2025 05:42 PM (IST)

    హైదరాబాద్‌లో సందడిగా గణనాథుల నిమజ్జనం..

    హైదరాబాద్‌లో సందడిగా కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం. భక్తుల కోలాహలం మధ్య గణనాథుల నిమజ్జనం. జనసంద్రాలుగా మారిన హైదరాబాద్‌ రహదారులు. నగర నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్న గణనాథులు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న వివిధ రూపాల్లో ఉన్న గణనాథులు.

  • 06 Sep 2025 05:18 PM (IST)

    బేగంపేట విమానాశ్రయం నుండి ఏరియల్ వ్యూ

    బేగంపేట విమానాశ్రయం నుండి ఏరియల్ వ్యూ ద్వారా హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన సరళిని పరిశీలిస్తున్న హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్,మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్ , హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ , జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన

  • 06 Sep 2025 05:12 PM (IST)

    గణనాథుల్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    గణేష్ నిమజ్జనం సందర్భంగా అంబర్పేట్ లోని వివిధ డివిజన్ లలోని గణనాథుల్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • 06 Sep 2025 04:22 PM (IST)

    సీఎం రేవంత్ సరికొత్త రికార్డ్.. 45 ఏళ్లలో తొలిసారి..

    ట్యాంక్‌బండ్‌ నుంచి జూబ్లీహిల్స్‌లో నివాసానికి బయల్దేరిన సీఎం రేవంత్. 45 ఏళ్లలో నిమజ్జనానికి ఏ సీఎం కూడా రాలేదన్న భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ. సీఎం రేవంత్‌ను మాట్లాడాలని కోరిన భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ సభ్యులు. ప్రసంగం వద్దని ఉత్సవ కమిటీ సభ్యులను వారించిన సీఎం రేవంత్‌. గణపతి బప్పా.. మోరియా అని పలికిన సీఎం రేవంత్‌ రెడ్డి.

  • 06 Sep 2025 04:03 PM (IST)

    నిమజ్జన ప్రక్రియను పరిశీలించిన సీఎం రేవంత్..

    నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్‌కు చేరుకున్న సీఎం. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలిస్తున్న సీఎం రేవంత్.

  • 06 Sep 2025 03:53 PM (IST)

    ఏంజే మార్కెట్ కి బాలాపూర్ గణేష్..

    చార్మినార్ మదీనా నుంచి గోల్ మజీద్ మీదుగా మరికొద్ది సేపట్లో ఏంజే మార్కెట్ చేరుకోనున్న బాలాపూర్ గణనాథుడు.

  • 06 Sep 2025 03:51 PM (IST)

    గణపతి నిమజ్జనంలో అపశృతి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోటుమాలలో విషాదం.. సముద్ర తీరంలో గణేష్ నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు మృతి..

  • 06 Sep 2025 03:33 PM (IST)

    ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు..

    ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు.. 1000 సీసీ కెమెరాలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ.. నిమజ్జనంలో 15 వేల మంది సిబ్బంది.. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాట్లు.. ఎలాంటి ఆటంకాలు కలగకుండా దారిపొడవున 160 యాక్షన్ టీమ్స్.. హూస్సేన్ సాగర్ లో 9 బూట్లు, 200 మంది గజ ఈతగాళ్లు.. 13 పోలీస్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..

  • 06 Sep 2025 03:08 PM (IST)

    వాహనాలతో కిక్కిరిసిన ట్యాంక్బండ్

    హైదరాబాద్: హుస్సేన్ సాగర్లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. వాహనాలతో కిక్కిరిసిన ట్యాంక్బండ్ పరిసరాలు.. ట్యాంక్బండ్కు భారీగా తరలి వస్తున్న గణనాథులు..

  • 06 Sep 2025 02:59 PM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనాలు..

    ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.. హైదరాబాద్‌లో నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. రాష్ట్రంలోని అన్ని చోట్ల నిమజ్జనం కొనసాగుతుంది.. సాయంత్రం 4 గంటలలోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది.. నిమజ్జనం రేపటి వరకు కొనసాగుతుంది: డీజీపీ జితేందర్

  • 06 Sep 2025 02:34 PM (IST)

    వైభవంగా కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జనోత్సవం.

    హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవం వైభవంగా కొనసాగుతోంది.. ట్యంక్‌బండ్‌కు భారీగా తరలివస్తున్నారు గణనాథులు.. దీంతో, సందడిగా మారిపోయాయి ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. వెయ్యి సీసీ కెమెరాలతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు..

  • 06 Sep 2025 01:52 PM (IST)

    ప్రశాంతంగా ముగిసిన బడా గణేశుడి నిమజ్జనం

    గంగమ్మ ఒడికి చేరాడు ఖైరతాబాద్‌ మహా గణపతి.. ప్రశాంతంగా ముగిసింది బడా గణేశుడి నిమజ్జనం.. ఖైరతాబాద్‌లోని మండపం నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్ 4 వరకు కన్నులపండుగా సాగింది శోభాయాత్ర

  • 06 Sep 2025 01:29 PM (IST)

    గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహా గణపతి..

    గంగమ్మ ఒడికి చేరారు ఖైరతాబాద్‌ మహా గణపతి.. ఖైరతాబాద్‌ నుంచి టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, సచివాలయం మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి వచ్చిన బడా గణపయ్య.. ఎన్టీఆర్‌ మార్గంలోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యారు..

  • 06 Sep 2025 12:55 PM (IST)

    కిక్కిరిసిన ట్యాంక్‌బండ్‌ పరిసరాలు..

    హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం కొనసాగుతోంది.. హుస్సేన్‌సాగర్‌ భారీ సంఖ్యలో గణనాథులు తరలివస్తున్నారు.. ట్యాంక్‌బండ్‌కు పరిసర ప్రాంతాల్లో గణనాథులు క్యూకట్టారు.. ఇక, భక్తులతో కిక్కిరిసిపోయాయి ట్యాంక్‌బండ్‌ పరిసరాలు..

  • 06 Sep 2025 12:18 PM (IST)

    కాసేపట్లో ఖైరతాబాద్‌ బడా గణేష్‌ నిమజ్జనం

    ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్రగా క్రేన్ నంబర్ 4 దగ్గరకు చేరుకున్నారు.. కాసేపట్లో ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం చేయనున్నారు..

  • 06 Sep 2025 11:37 AM (IST)

    16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    బాలాపూర్‌ గణేషుడి శోభాయాత్ర ప్రారంభమైంది.. లడ్డూ వేలం పాట ముగిసిన వెంటనే శోభాయాత్రను స్టార్ట్‌ చేశారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు 16 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుంది.. చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌ చేరుకోనున్న బాలాపూర్‌ గణేష్‌ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

  • 06 Sep 2025 11:31 AM (IST)

    కాసేపట్లో బడా గణేష్‌ నిమ్జనం..

    ఎన్టీఆర్‌ మార్గ్‌లో కొనసాగుతోంది ఖైరతాబాద్‌ మహా గణేష్‌ శోభాయాత్ర.. కాసేపట్లో బాహుబలి క్రేన్‌ నంబర్ 4 దగ్గర బడా గణేష్‌ నిమజ్జనం జరగనుంది.. క్రేన్‌ వరకు రూట్‌ క్లియర్‌ చేశారు అధికారులు

  • 06 Sep 2025 11:08 AM (IST)

    ఆరేళ్లకు గణేషుడు దయదలిచాడు..

    బాలాపూర్‌ గణేష్ లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం.. 2019 నుంచి బాలాపూర్‌ వస్తున్నా.. గత ఆరు ఏళ్లుగా గణేష్‌ లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు ఆ భగవంతుడు దయదలిచాడు.. చాలా సంతోషంగా ఉందన్నారు వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్‌

  • 06 Sep 2025 10:55 AM (IST)

    రూ.35 లక్షలు పలికిన బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ

    బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ కొత్త రికార్డు సృష్టించింది.. వేలంలో రూ.35 లక్షలు పలికింది బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ.. ఏడుగురు సభ్యుల మధ్య జరిగిన వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు లింగాల దశరథ్‌ గౌడ్‌

  • 06 Sep 2025 10:44 AM (IST)

    బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం లైవ్

  • 06 Sep 2025 10:35 AM (IST)

    తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వద్దకు ఖైరతాబాద్‌ గణేష్‌..

    69 అడుగుల ఖైరతాబాద్‌ బడా గణనాథుడు టెలిఫోన్‌ భవన్‌ దాటి తెలుగుతల్లి ప్లైఓవర్‌ వైపు కదులుతున్నాడు.. భక్త జనసంద్రంగా మారిపోతోంది సచివాలయ ప్రాంగణం...

  • 06 Sep 2025 10:33 AM (IST)

    కాసేపట్లో బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం..

    బాలాపూర్‌లో గణేష్‌ ఊరేగింపు పూర్తి అయ్యింది.. వేలంపాట జరిగే బొడ్రాయి దగ్గరకు చేరుకున్నారు బాలాపూర్‌ గణేష్‌.. కాసేపట్లో గణేష్‌ లడ్డూ వేలం ప్రారంభం కానుంది..

  • 06 Sep 2025 10:03 AM (IST)

    రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు

    గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు.. అయితే, ఇదే సమయంలో గణేష్‌ నిమజ్జనోత్సవానికి తరలివచ్చే భక్తుల కోసం.. మెట్రో రైలు ప్రత్యేక చర్యలు చేపట్టింది.. ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది..

  • 06 Sep 2025 10:01 AM (IST)

    హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

    గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి.. రేపు రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు పోలీసులు.. ఇక, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌ వరకు ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇవ్వగా.. ఇతర రాష్ట్రాలు, జిల్లాల బస్సులకు చాదర్‌ఘాట్‌ వరకు అనుమతి ఇచ్చారు.

  • 06 Sep 2025 09:25 AM (IST)

    నెమ్మదిగా కదులుతున్న ఖైరతాబాద్ బడా గణేష్‌..

    గంగమ్మ ఒడిపై చాలా నెమ్మదిగా కదులుతున్నాడు ఖైరతాబాద్ బడా గణేష్.. ఈ టైమ్ వరకు టెలిఫోన్ భవన్ చేరుకోవాల్సిన శోభాయాత్ర... కానీ, ఇంకా సెన్సేషన్ థియేటర్ వద్దే బడా గణేష్ ఉన్నాడు.. వేలాదిగా తరలివస్తున్నారు భక్తులు.

  • 06 Sep 2025 09:22 AM (IST)

    ఎన్టీఆర్ మార్గ్ ఖాళీ..

    ఎన్టీఆర్ మార్గ్ లో ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనం జరిగే దగ్గర అటు వైపు రోడ్డు క్లోజ్‌ చేసిన పోలీసులు.. సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ లో ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ గుండా ట్యాంక్ బండ్ వైపు తరలింపు

  • 06 Sep 2025 09:19 AM (IST)

    కాసేపట్లో బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం

    బాలాపూర్‌ గణేషుడి ఊరేగింపు ఆ గ్రామంలో కొనసాగుతోంది.. కాసేపట్లో బొడ్రాయి దగ్గరకు చేరుకోనున్నాడు గణపయ్య.. ఆ తర్వాత వేలంపాట కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపైకి ఈ సారి లిస్ట్‌ లో ఉన్నవారికి అనుమతి ఇస్తారు.. ఆ వెంటనే వేలంపాటు ప్రారంభం కానుంది..

  • 06 Sep 2025 09:09 AM (IST)

    కిక్కిరిసిన నెక్లెస్‌ రోడ్‌

    హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.. గణేష్‌ శోభాయాత్ర వాహనాలతో నెక్లెస్‌ రోడ్‌ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.. నిమజ్జనానికి భారీ సంఖ్యలో బారులుతారారు గణపతులు

  • 06 Sep 2025 08:42 AM (IST)

    హైదరాబాద్‌లో 303 కి.మీ. మేర శోభాయాత్ర

    హైదరాబాద్‌లో వినాయక మహా నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. హుస్సేన్‌సాగర్‌తో పాటుపలు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు సాగుతున్నాయి.. 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.. హుస్సేన్‌సారగ్‌ చుట్టూ నిమజ్జనానికి 30 క్రేన్లు ఏర్పాటు జరిగాయి.. సరూర్‌నగర్‌, ఐడీపీఎల్, సఫిల్‌గూడ, సున్నంచెరువు సహా 20 చెరువులు, 72 కృత్రిమ కొలన్లలో నిమజ్జన ఏర్పాట్లు చేశారు.. 134 క్రేన్లు 259 మొబైల్‌ క్రేన్లతో నిమజ్జనం సాగుతోంది.. గ్రేటర్‌ వ్యాప్తంగా 303 కి.మీ. మేర శోభాయాత్రలు కొనసాగనున్నాయి..

  • 06 Sep 2025 08:19 AM (IST)

    గణేష్‌ల దారి మళ్లింపు..

    తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ రూట్ లో గణేష్ విగ్రహాలను దారి మళ్లించారు అధికారులు.. వినాయకులన్నిటినీ ప్రస్తుతం ట్యాంక్ బండ్ వైపు దారి మళ్లించారు పోలీసులు.. ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభం కావడంతో రోడ్ క్లియర్ చేస్తున్నారు పోలీసు అధికారులు

  • 06 Sep 2025 07:54 AM (IST)

    ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం..

    ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.. ఉదయం 6 గంటల లోపే శోభాయాత్ర ప్రారంభించాలని ప్రయత్నాలు చేసినా.. రెండు గంటలు ఆలస్యంగా శోభాయాత్ర స్టార్ట్ అయ్యింది.. దీంతో, కాస్త వేగంగా బడా గణపతిని ముందుకు కదిలిస్తున్నారు

  • 06 Sep 2025 07:48 AM (IST)

    బాలపూర్‌ లడ్డూ కోసం ఏడుగురి మధ్య పోటీ..

    హైదరాబాద్‌: ఉదయం 10 గంటలకు బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం ప్రారంభం కానుంది.. యాక్షన్‌లో పాల్గొనేవారి ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించింది బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి.. 1. మర్రి రవికిరణ్​ రెడ్డి (చంపాపేట్‌), 2. అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి (ఎల్బీ నగర్‌), 3. లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్‌) ,4. కంచర్ల శివారెడ్డి (కర్మాన్‌ఘాట్‌) , 5. సామ రాంరెడ్డి (దయా).. కొత్తగూడెం, కందుకూరు , 6. పీఎస్‌కే గ్రూప్‌ (హైదరాబాద్‌), 7. జిట్టా పద్మా సురేందర్‌రెడ్డి (చంపాపేట్‌) ఉన్నారు

Exit mobile version