థర్డ్‌వేవ్ వస్తుందన్న సమాచార నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పరిస్ధితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను అధికారులు వివరించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జగన్ ఆదేశించారు. ఈమేరకు అధికారులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈమేరకు ఏపీలో రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగింపు ఇచ్చారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్‌లో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ఈ సమావేశంలో చూచించారు. వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్న వైద్యాధికారులు సిఫార్సు చేశారు. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు వద్దని వైద్యాధికారుల సిఫార్సు చేస్తూ.. నిమజ్జన ఊరేగింపులు వద్దని వైద్యాధికారులు తెలియచేశారు. కాగా, ఈమేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవన్నారు.
