Site icon NTV Telugu

సెప్టెంబర్ 10 న గణేష్ ఉత్సవాలు ప్రారంభం : మంత్రి తలసాని

సెప్టెంబర్ 10 న గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇవాళ గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని… కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా, నియమాలు పాటిస్తూ నిర్వహించుకోవాలని తెలిపారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ లో వినాయక చవితి పండుగ జరుగనున్నట్లు వెల్లడించారు. అటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి పండుగ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మట్టి గణపతులు, గోమయ గణపతులు కూడా తయారు చేస్తున్నారని వెల్లడించారు.

Exit mobile version