Site icon NTV Telugu

GamGamGanesha: ‘గం.గం..గణేశా’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్..

Gam Gam Ganesha

Gam Gam Ganesha

విజయ్ దేవరకొండకు తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లో ‘దొరసాని’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ‘బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఆనంద్. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గం.గం..గణేశా’.. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నయని సారిక’ కథానాయిక. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also read: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..

ఈ చిత్రం మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించి చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రొడక్షన్ టీమ్ ఇటీవల ‘ రెండవ సింగల్’ అప్డేట్‌ ను విడుదల చేసింది. “పిచ్చిగా నచ్చేసావే..” అనే పాటను మే 4వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓ వైపు కామెడీ, మరోవైపు రామసీమ నేపథ్యం ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

Exit mobile version