Site icon NTV Telugu

Game Changer : రాంచరణ్ “గేమ్ ఛేంజర్” షూటింగ్ కు మోక్షం కలిగేది ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 05 12 At 8.28.33 Am

Whatsapp Image 2024 05 12 At 8.28.33 Am

Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ నటిస్తున్నలేటెస్ట్ మూవీ “గేమ్‌ఛేంజర్‌”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ “కియారా అద్వానీ” హీరోయిన్ గా” నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ “అంజలి” ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.అయితే దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా “ఇండియన్ 2” సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దీనితో “గేమ్ చేంజర్” సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

Read Also : Naga Chaitanya : విరూపాక్ష దర్శకుడితో చైతూ సినిమా.. ఈ సారి టార్గెట్ అదేనా..?

అయితే “ఇండియన్ 2” సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధం కావడంతో దర్శకుడు శంకర్ రాంచరణ్ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా 45 రోజుల  పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తుంది.ఈ షెడ్యూల్ కనుక పూర్తయితే గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.అయితే రాంచరణ్ అభిమానులు మాత్రం ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో నవీన్‌ చంద్ర, సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version