గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి మొత్తానికి ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి అనే సాంగ్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ మంగళవారం (నవంబర్ 7) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ కొన్ని రోజుల కిందట రిలీజైన సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ జరగండి పాటపై రామ్ చరణ్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. తన సినిమాలోని పాటల కోసం భారీగా ఖర్చు పెట్టిస్తాడు దర్శకుడు శంకర్.. అయితే ఖర్చు పెట్టించిన ప్రతి రూపాయికి పూర్తి న్యాయం చేస్తారు.. అలాగే జరగండి పాటను కూడా భారీ రేంజ్ లో చిత్రీకరించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ గేమ్ ఛేంజర్ మూవీ ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ సారెగామ దక్కించుకున్నట్లు కూడా ఈ సందర్బంగా మేకర్స్ తెలిపారు.ఈ ఫస్ట్ సింగిల్ దీపావళికి వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఈ గేమ్ ఛేంజర్ సాంగ్ లీకైన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే మూవీ ఆడియో హక్కులు, ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ రావడం విశేషం..గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాను భారీగా నిర్మిస్తున్నాడు… అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి వుంది.. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమవుతోంది. ఓవైపు ఇండియన్ 2 సినిమా చేస్తూనే మరోవైపు శంకర్ ఈ గేమ్ ఛేంజర్ సినిమాను కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇండియన్ 2 నుంచి ఈ మధ్యే ఇంట్రో వీడియో విడుదలయి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది..